Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు రావాల్సిన గుర్తింపు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కెప్టెన్‌గా ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచినా.. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయినా తాను హార్డ్ వర్క్‌ను కొనసాగించానని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే కేకేఆర్ టైటిల్ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ కంటే ఆ జట్టు మెంటార్‌గా గౌతమ్ గంభీర్‌కే ఎక్కువ గుర్తింపు లభించింది.

కెప్టెన్‌గా టైటిల్ అందించినా.. శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. దాంతో అతను ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రాగా.. పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి తమ కెప్టెన్‌గా నియమించింది. తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీలతో కలిసి కీలక భాగస్వామ్యాలను నమోదు చేశాడు.

Shreyas Iyer Feels He Didn t Receive Enough Recognition After KKR s IPL 2024 Victory

గుర్తింపు రాలేదు..
ఈ విజయానంతరం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'గత సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలవడంపైనే ప్రధాన ఫోకస్ పెట్టాను. ఆ దేవుడి దయవల్ల నేను అనుకున్నది సాధించాను. అయితే ఈ విజయం తర్వాత నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపించింది. కానీ నేను నా పనిని ఆపలేదు. నా ఆటను మెరుగు పరుచుకునేందుకు మరింత కష్టపడ్డాను. నేను చెప్పే గుర్తింపు అంటే గౌరవం. మైదానంలో పడే కష్టానికి దక్కే గౌరవం. కొన్నిసార్లు సరైన గుర్తింపు దక్కదు. కానీ నా ప్రయత్నాలకు నేను సంతృప్తి చెందుతాను. ఎందుకంటే అవి బ్యాటింగ్ చేయడానికి అంత సులువైన వికెట్లు కావు.

Take a Poll

నన్ను నేను ప్రశ్నించుకున్నా..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం చాలా సంతృప్తినిచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇదో ఒక ప్రయాణం. నా జీవితంలోని ఈ దశలో నేను చాలా నేర్చుకున్నాను. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం నేను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాను. దాంతో నేను ఎక్కడ తప్పు చేశాను? ఏమి చేయాలా? నా ఫిట్‌నెస్ ఎంత మెరుగుపర్చుకోవాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఒక టైమ్‌ టేబుల్‌ సిద్దం చేసుకొని నా శిక్షణను కొనసాగించాను. నేను మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలపై ఫోకస్ పెట్టాను.

దేశవాళీ క్రికెట్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడం ఎంత ముఖ్యమో నాకు తెలుసొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనే నా సమస్యలను గుర్తించాను. ఈ విషమ దశ నుంచి నేను బయటపడిన విధానం, ఈ పరిస్థితులను నేను హ్యాండిల్ చేసిన తీరు.. మరీ ముఖ్యంగా నన్ను నేను నమ్ముకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 11, 2025, 17:07 [IST]
Other articles published on Mar 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+