సూర్య కెప్టెన్సీకి శ్రేయస్ అయ్యర్ ఎసరు..!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌ను ఓటమెరుగని జట్టుగా నడిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై కేవలం 35 బంతుల్లో 66 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.దాంతో సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీకి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయ్యర్ నిలకడైన ప్రదర్శన జాతీయ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌ను సూర్య విజేతగా నిలబెట్టినా.. గతేడాదిగా అతను బ్యాటింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. తాజా ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అమెరికాతో మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో డకౌట్ అవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ టీమ్‌ను సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ ప్రణాళికల్లో భాగంగా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాడినే కెప్టెన్‌గా కొనసాగించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌ల తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై బీసీసీఐ పునరాలోచన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్ బ్యాటర్‌గానే కాకుండా.. విజయవంతమైన కెప్టెన్‌గా సత్తా చాటాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు నడిపించిన అతను, 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కప్ గెలిపించాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టును అగ్రస్థానంలో నిలుపుతున్నాడు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ఇతర ఆటగాళ్ల కూడా తడబుడుతుండటంతో భారత తదుపరి కెప్టెన్సీ బాధ్యతలు అందుకునే అవకాశం శ్రేయస్ అయ్యర్‌కు ఎక్కువగా ఉంది. సూర్య బ్యాటింగ్ ఫామ్ అందుకోకపోతే.. అయ్యర్ భారత టీ20 జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications