Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ కాదు.. అతని వల్లే గెలిచాం: శ్రేయస్ అయ్యర్

మయాంక్ యాదవ్ అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతోనే జింబాబ్వేతో తొలి టీ20లో విజయం సాధించామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మయాంక్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో విజయానికి ఫ్లాట్‌ఫామ్ సెట్ చేశాడని, ఆ తర్వాత వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పనిని పూర్తి చేశాడని పేర్కొన్నాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.

IND vs ZIM: రఫ్ఫాడించిన మయాంక్ యాదవ్.. చేతులెత్తేసిన జింబాబ్వే!

IND vs ZIM: రఫ్ఫాడించిన మయాంక్ యాదవ్.. చేతులెత్తేసిన జింబాబ్వే!

ఇంతకంటే సంతోషం ఏం ఉంటుంది..?

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. 'కెప్టెన్‌గా తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఆనందమైన విషయం మరొకటి లేదు. మా ఆటగాళ్లు ప్రణాళికలను అమలు చేసిన తీరు చాలా బాగుంది.

Shreyas Iyer Credits Mayank Yadav and Vaibhav Sooryavanshi For India Win Over Zimbabwe In 1st T20I

ముందే చెప్పినట్లుగా పిచ్‌లో బౌన్స్‌ ఉంది. ముఖ్యంగా హార్డ్ లెంగ్త్ నుంచి మంచి బౌన్స్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో బౌన్స్‌లో వైవిధ్యం కూడా కనిపించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పిచ్ తీరు దాదాపు ఒకేలా ఉంది. కానీ మయాంక్ యాదవ్ మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతను తన లెంగ్త్‌ను నియంత్రిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులు తీసే అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ వచ్చి మాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

వైభవ్ బ్యాటింగ్ అద్భుతం..

జింబాబ్వేను ఆలౌట్ చేయాలని అనుకోలేదు. ఏ జట్టులోనైనా సరే.. ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లి గౌరవప్రదమైన స్కోర్ అందించే బ్యాటర్ ఒకరు ఉంటారు. వాళ్లు పిచ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకొని, భాగస్వామ్యాలు నెలకొల్పడం ప్రారంభించారు. నేను మాత్రం బౌలర్లందర్నీ రొటేట్ చేశాను. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని భావించాను.

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతను ఫియర్‌లెస్ యంగ్ బ్యాటర్. అతను ఆడిన విధానం అసాధారణం. అతనికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. అండర్ 19 ఫైనల్లో అతను 175 పరుగులు చేశాడనుకుంటా. అందుకే మైదానంలోకి అడుగుపెట్టగానే అతనిలో అపారమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. అతని బ్యాటింగ్ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌కి ఇది చాలా మంచి ఆరంభం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, July 23, 2026, 22:05 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+