అంతా లక్ష్మణ్ సర్ దయ.. తొలి సిరీస్ విజయంపై శ్రేయస్ అయ్యర్ భావోద్వేగం!
వరుసగా రెండు సిరీస్ పరాజయాల తర్వాత టీమిండియా నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. తీవ్ర విమర్శలు, ఒత్తిడి మధ్య జింబాబ్వే పర్యటనకు వెళ్లిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత యువ జట్టు అసాధారణ ప్రదర్శనతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్,ఫీల్డింగ్‌లో సత్తా చాటి మూడు మ్యాచ్‌ల్లోనూ ఏకపక్ష విజయాలను అందుకుంది.
ఈ సిరీస్ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తాత్కలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సర్ సాయంతోనే ఈ సిరీస్ గెలిచామని తెలిపాడు. ఆయనే ఆత్మవిశ్వాసం కోల్పోయిన తనలో స్ఫూర్తి నింపాడని చెప్పుకొచ్చాడు. థ్యాంకూ సర్ అంటూ అయ్యర్ ఎమోషన్ అయ్యాడు.

అది ఒక్కటి మినహా..
'క్యాచ్‌లు వదిలేయడం మినహాయిస్తే ఈ పర్యటనలో మా ప్రదర్శనలో ఎలాంటి లోపాలు లేవు. సపోర్ట్ స్టాఫ్‌తో సహా జట్టులో ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో భాగమయ్యారు. వీవీఎస్ లక్ష్మణ్ సర్‌కు స్పెషల్ థ్యాంక్స్. మేం బరిలోకి దిగిన ప్రతిసారీ ఆయన అద్భుతమైన విషయాలు చెప్పారు. వాటితో మేం బాగా కనెక్టయ్యాం.'అని బీసీసీఐ విడుదల చేసిన డ్రెస్సింగ్ రూమ్ వీడియోలో శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
జింబాబ్వే పర్యటన నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. అతని స్థానంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ) డైరెక్టర్ లక్ష్మణ్‌ను తాత్కలిక కోచ్‌గా ఎంపిక చేసింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి టీ20 ఆటగాళ్లు లేకపోయినా.. కుర్రాళ్లతో కూడిన జట్టును లక్ష్మణ్ అద్భుతంగా నడిపించాడు.
నాకొద్దు ఆ పదవి..
ఈ సిరీస్ విజయం నేపథ్యంలో లక్ష్మణ్‌నే హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్స్‌పై లక్ష్మణ్ స్పందిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ పదవి తనకు వద్దని స్పష్టం చేశాడు. 'గంభీర్ గైర్హాజరీలోనే నేను తాత్కలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాను. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌తో అతను తిరిగి బాధ్యతలు చేపడుతాడు.
నాలుగేళ్లుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా కొనసాగుతున్న నేను.. అవసరమైనప్పుడు మాత్రమే భారత జట్టుకు కోచ్‌గా పనిచేస్తుంటాను. గంభీర్‌ను తప్పించాలని డిమాండ్ చేయడం సరికాదు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పని చేయడం వల్ల యువ క్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తోంది. నాకు అదే ఎంతో సంతృప్తిని ఇస్తోంది.' అని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

