Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyas Iyer: శ్రేయస్ భాయ్‌.. కత్తి వేలాడుతోంది!

వరుస పరాజయాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. గురువారం(జూలై 23) హరారే వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ అగ్ని పరీక్షగా మారనుంది.

IND vs ENG: అతను విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడాడు: అశ్విన్

IND vs ENG: అతను విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడాడు: అశ్విన్

పసికూన ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఆడిన 7 టీ20ల్లో ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. మరింత యంగ్ టీమ్‌తో జింబాబ్వేతో సిరీస్ ఆడబోతున్నాడు.

Shreyas Iyer Captaincy and Place in Team India Under Threat Ahead of T20I Series against Zimbabwe

ఏ లెక్కన చూసుకున్నా టీమిండియాకు జింబాబ్వే పోటీనే కాదు. కానీ ఇటీవల భారత్ ప్రదర్శన జింబాబ్వే‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. ఐర్లాండ్ తరహాలోనే భారత్‌ను ఓడించాలనే కసితో ఆ జట్టు ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా మాట్లాడుతూ.. సిరీస్ గెలవడానికి ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పాడు.

అవి నరం లేని నాలుకలు.. పట్టించుకోవద్దు: శ్రేయస్ అయ్యర్

అవి నరం లేని నాలుకలు.. పట్టించుకోవద్దు: శ్రేయస్ అయ్యర్

టీమిండియా బౌలింగ్, మిడిలార్డర్ బ్యాటింగ్ బలహీనతగా కనిపిస్తున్నాయి. ప్రిన్స్ యాదవ్‌తో భారత బౌలర్లంతా కొత్త వారు కాగా.. మిడిలార్డర్ వైఫల్యం పెద్ద తలనొప్పిగా మారింది. టీ20ల్లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మూడో స్థానంలో మెరుగ్గా రాణించినప్పటికీ.. ఆ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడిస్తున్నారు. ఫలితంగా ఐదో స్థానంలో తిలక్ సౌకర్యవంతంగా ఆడలేకపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించేందుకు రింకూ సింగ్‌ను తీసుకున్నా.. బ్యాటింగ్ కూర్పు ఎలా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఏది ఏమైనా ఈ సిరీస్ గెలవడం శ్రేయస్ అయ్యర్‌కు కీలకం. ఈ సిరీస్‌లోనూ భారత్ ఓడితే అతని కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రెండు సిరీస్‌లు ఓడిన టీమిండియా.. మరో సిరీస్‌లో కూడా ఓడితే విమర్శలు రెట్టింపు అవ్వనున్నాయి. ఈ సిరీస్‌కు తాత్కలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తుండటం అయ్యర్‌కు కలిసొచ్చే అంశం. అతను అనవసర ప్రయోగాల జోలికి పోకుండా జట్టు విజయానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఈ సిరీస్‌లో భారత్ పై చేయి సాధించాలంటే.. తొలి మ్యాచ్‌లో గెలవడం కీలకం.

Story first published: Thursday, July 23, 2026, 14:28 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+