IPL 2026: ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. షూస్ లేకుండా మైదానంలోకి వచ్చాడు. చెప్పులతో మైదానంలోకి వచ్చిన అతన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని బ్రాడ్‌కాస్టర్ సిబ్బంది సూచించారు. దాంతో అప్పటికప్పుడు కెమెరామెన్ షూస్ అడుక్కొని హోస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా..నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
బ్యాట్, జెర్సీలు అడుక్కోవడం చూశాం కానీ.. ఇలా షూస్ అడుక్కోవడం ఏంటి బ్రో అని ఒకరంటే.. 'ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా'అని కామెంట్ చేస్తున్నారు. కెమెరామెన్ మాత్రం అయ్యర్ చెప్పులు వేసుకోకుండా సాక్స్‌ల సాయంతోనే నడుస్తూ కనిపించాడు. అతను అయ్యర్ చెప్పులు వేసుకోవచ్చు కదా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కనీసం అయ్యర్ అయినా తన చెప్పులు వేసుకోవాలని సూచించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ సింప్లిసిటీ అని మరికొందరు అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93), కూపర్ కనోల్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) భారీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/25), సిద్దార్థ్(2/35) రెండేసి వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రిషభ్ పంత్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఆయుష్ బదోని(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఎయిడెన్ మార్క్‌రమ్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) పోరాటం సరిపోలేదు.
పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్(2/37) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు. 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మరో రెండు విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications