IND vs IRE: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్
మిడిల్ ఓవర్లలో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడం తమ పతనాన్ని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 140 పరుగులకు కట్టడి చేసి ఉంటే లక్ష్యాన్ని ఛేదించడం సులువయ్యేదని తెలిపాడు.
రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్..బ్యాటింగ్ కంటే బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. గ్రౌండ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయాలేకపోయామని తెలిపాడు.

మిడిల్ ఓవర్ల వైఫల్యం..
'ఆరంభంలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. వారికి పిచ్ నుంచి స్వింగ్ లభించింది. రెండు వికెట్లు కూడా తీశారు. దాంతో మాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. కానీ మిడిల్ ఓవర్లలో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఈ గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవని తెలిసినప్పటికీ, స్ట్రెయిట్ షాట్లు ఆడేలా బంతులు వేసాం.
డెత్ ఓవర్లలో మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే.. ఐర్లాండ్‌ను 140 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఛేజ్ చేయడానికి సులువయ్యేది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ఇక్కడ ఆడటం ఒక గొప్ప అనుభవం. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఆడే అవకాశం మాకు దక్కింది. పిచ్ ఎలా ఉందనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కెప్టెన్‌గా నాకైతే ఇది మంచి అనుభవమే.
సుదీర్ఘ విరామం తర్వాత ఆడటం వల్ల కూడా మా జట్టు కాస్త తడబడింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని వీలైనంత త్వరగా మర్చిపోయి.. తదుపరి మ్యాచ్ కోసం సిద్దమవుతాం. అయితే ఈ ఓటమి నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తదుపరి మ్యాచ్‌లో సరికొత్త ఉత్సాహం,రెట్టింపు బలంతో బరిలోకి దిగుతాం.
హర్షిత్, శివమ్ బౌలింగ్ అద్భుతం..
హర్షిత్ రాణా , శివమ్ దూబే అద్బుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి వారికి సహకారం లభించింది. శివం విషయానికి వస్తే.. అతను గతంలోనూ చాలా కీలకమైన ఓవర్లు వేశాడు. అందువల్ల నేను అతన్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తాను. నేను దేశవాళీ క్రికెట్‌లోనూ అతనితో కలిసి ఆడాను కాబట్టి అతని బలాలు, బలహీనతలు నాకు బాగా తెలుసు. అలాగే హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి.. ఈ స్థాయిలో రాణించడం చాలా గొప్ప విషయం.
క్రికెట్‌లో ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేం. మైదానంలోకి అడుగుపెట్టగానే మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదు. ఇక్కడ కష్టపడాలి, ఆ క్షణంలో ఆటపైనే దృష్టి పెట్టాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా.. ఎప్పుడూ ప్రస్తుతంలోనే జీవించాలి. ప్రత్యర్థిని దెబ్బతీసే అవకాశం వచ్చినప్పుడు, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఏ ఒక్క క్షణాన్ని లేదా పరిస్థితిని కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. తదుపరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్..
ఈ గెలుపుతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. గత 8 ప్రయత్నాల్లో దక్కని విజయం ఈ మ్యాచ్‌లో వరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మ్యాట్ హోల్డార్డ్(3/28), మాథ్యూ హంప్రేస్(3/38) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

