Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడే తప్పు చేశాం.. ఐర్లాండ్ మా కంటే బాగా ఆడింది: శ్రేయస్ అయ్యర్

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐర్లాండ్ తమ కంటే బాగా ఆడిందని అంగీకరించాడు. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా పసికూన ఐర్లాండ్‌‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమిపాలైంది. అద్వితీయమైన ప్రదర్శనతో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో టీమిండియాను ఓడించి రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారత్‌కు ఇది ఘోర పరాభావం.

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

ఐర్లాండ్ బాగా ఆడింది..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఐర్లాండ్ తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. ఇది ఖచ్చితంగా మంచి సిరీస్ అయితే కాదు. కానీ ఐర్లాండ్ ఆడిన తీరుకు వారిని అభినందించాలి. ఐర్లాండ్ టీమ్ అద్భుతమైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై వారికి ఖచ్చితంగా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే వారి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వారికి లభించిన ఒక సమష్టి విజయం. వారికి నా అభినందనలు.

Shreyas Iyer Blames Batting Failure as Clinical Ireland Clinch Historic T20I Series Against India

ఆ విషయంలో వెనుకబడ్డాం.

తొలి మ్యాచ్ ఓటమి తర్వాత మేం చాలా విషయాల్లో మెరుగయ్యాం. ఈ రోజు మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేసిన తీరు అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్‌లో మాత్రం మేం కాస్త వెనుకబడ్డాం. పిచ్ ఎలా స్పందిస్తుందో అనే విషయాన్ని విశ్లేషించడంలో.. అలాగే సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చడంలో మేం వెనుకబడ్డాం. ఆ విభాగంలో వారు ఖచ్చితంగా మమ్మల్ని మించిపోయారని నేను భావిస్తున్నా.

మా అరంగేట్ర ప్లేయర్స్‌ ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే రాణించారు. ప్రిన్స్ యాదవ్ తన ఐపీఎల్ అనుభవాన్ని ఇక్కడ కొనసాగించాడు. తన స్వంత ఆలోచనలు, ప్రణాళికలతో బౌలింగ్ చేశాడు. సూర్యాంశ్‌ ఈ మ్యాచ్ నుంచి నేర్చుకుంటాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

చాలా కాలంగా ఇదే తప్పు చేస్తున్నాం: హర్మన్ ప్రీత్ కౌర్

చాలా కాలంగా ఇదే తప్పు చేస్తున్నాం: హర్మన్ ప్రీత్ కౌర్

తిలక్ రాణించినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెన్ కాలిట్జ్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/22) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(2/35), శివమ్ దూబే(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 55) రాణించినా ఫలితం లేకపోయింది. ఐర్లాండ్ బౌలర్లలో జై మూండ్రా(3/32), మ్యాట్ హోల్లార్డ్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ హంప్రేస్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి ప్రిన్స్ యాదవ్ 6 బాదినా ఫలితం లేకపోయింది.

Story first published: Monday, June 29, 2026, 10:06 [IST]
Other articles published on Jun 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+