న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas Iyer హాఫ్ సెంచరీ.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత!

Shreyas Iyer Becomes First Indian To Complete Massive Feat Of India vs New Zealand 1st Test

కాన్పూర్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన అయ్యర్.. తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన అయ్యర్.. సెకండ్ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ, హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన 16వ భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన అయ్యర్.. తాజా హాఫ్ సెంచరీలతో మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

రెండు ఘనతలు..

రెండు ఘనతలు..

భారత తరుపున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా కూడా అయ్యర్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నిగ్స్‌లు కలిపి అయ్యర్‌ 170 పరుగులు సాధించగా... తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నిగ్స్‌లో 65 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు అరంగేట్ర టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శిఖర్ ధావన్‌(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్‌ శర్మ ఉన్నాడు.

 మా గురువు గారి..

మా గురువు గారి..

సెంచరీపై అయ్యర్ మాట్లాడుతూ.. తన గురువుగారి కోరిక నేరవేరిందన్నాడు. 'ప్రవీణ్ సార్ దగ్గర శిష్యుడిగా చేరిన దగ్గర నుంచే నేను ఆటలో మెరుగయ్యాను. ఆయన నన్నెంతో ప్రోత్సహించాడు. వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి విజయం సాధించావు. ఐపీఎల్ కెప్టెన్‌గా కూడా విజయవంతం అయ్యావు. కానీ టెస్టు క్రికెట్ ఆడినప్పుడే నీ కెరీర్‌కు ఒక సార్థకత వస్తంది. నువ్వు టీమ్ ఇండియా తరపున టెస్ట్ క్యాప్ అందుకోవాలి. ఆ రోజు నాకు సంతోషం. అంతే కాదు నువ్వు టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేసిన రోజు నీ ఇంటికి డిన్నర్‌కు వస్తానని ప్రవీణ్ సార్ చెప్పారు' అని అయ్యర్ వెల్లడించాడు.

పట్టు బిగించిన భారత్..

పట్టు బిగించిన భారత్..

ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. 14/1 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 234/7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 49 పరుగుల ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్ ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో మిగిలిన 9 వికెట్లను త్వరగా తీస్తే భారత్ విజయం సాధించవచ్చు. కివీస్ గెలవాలంటే మాత్రం 90 ఓవర్ల ఆటలో 280 పరుగులు చేయాలి. డ్రా చేసుకోవాలంటే రోజంతా ఆడాల్సి ఉంటుంది.

ఆదుకున్న అయ్యర్..

ఆదుకున్న అయ్యర్..

51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అశ్విన్‌తో కలిసి 6వ వికెట్‌కు 52 పరుగులు జోడించిన అయ్యర్.. సాహాతో కలిసి 64 పరుగులు జోడించాడు. 167 పరుగుల వద్ద అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగినా.. సాహా(61 నాటౌట్), అక్షర్ పటేల్(28 నాటౌట్) ఓపికగా ఆడుతూ భారత్‌కు మంచి స్కోర్ అందించారు. ఈ ఇద్దరూ అజేయంగా 67 పరుగులు జోడించడంతో భారత్.. కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Story first published: Sunday, November 28, 2021, 18:57 [IST]
Other articles published on Nov 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X