టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. రంజీ ట్రోఫీ 2024 తర్వాత బుచ్చిబాబు టోర్నీతో రెడ్ బాల్ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఆశించిన ఆరంభాలను అందుకోలేకపోయారు.
తమిళనాడు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ 3 బంతుల్లో 2 పరుగులే చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 3 0 పరుగులు చేసి ఔటయ్యాడు.

దాంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 58.5 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది.
వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో జట్టులో చోటు దక్కించుకునేందుకు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.
ఈ టోర్నీతో పాటు వచ్చే నెలలో జరగనున్న దులీప్ ట్రోఫీలో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టించిన ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే వారికి ఆశించిన ఆరంభం దక్కలేదు. భారత్ వేదికగా గతేడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన అతను మళ్లీ టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకోలేదు.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో బరిలోకి దిగాడు. కానీ గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించగా.. ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. దాంతో బీసీసీఐ అతన్ని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అనంతరం రంజీ ట్రోఫీ 2024 నాకౌట్ మ్యాచ్‌లో అయ్యర్.. ముంబై తరఫున బరిలోకి దిగాడు. ప్రస్తుతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అయ్యర్.. మళ్లీ దేశవాళీ క్రికెట్ బాటనే పట్టాడు.