Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రేయస్ అయ్యర్ మాస్టర్ ప్లాన్!

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ సన్నదమవుతున్నాడు. సొంతగడ్డపై జరగనున్న ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సత్తా చాటేందుకు శ్రేయస్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ రచించాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌పై తన ఫోకస్ పెట్టాడు.

జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టిన అయ్యర్.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో భాగంగా జనవరి 12 నుంచి 15 వరకు ఆంధ్రాతో జరగనున్న మ్యాచ్‌లో అయ్యర్.. ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.

 Shreyas Iyer added to Mumbai squad for Ranji Trophy after Dropped From Indian T20I Team Vs Afghanistan

ఇంగ్లండ్‌ ఏతో జరిగే అనాధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు తరఫున ఆడేందుకు సర్ఫరాజ్ ఖాన్ ముంబై జట్టును వీడటంతో అతని స్థానంలో అయ్యర్ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు.

సౌతాఫ్రికా పర్యటనలోని రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 31, 6, 0, 4 నాటౌట్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటాలని అయ్యర్ భావిస్తున్నాడు.

ముంబై రంజీ టీమ్:
అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, జే బిస్తా, భూపేన్ లల్వానీ, అమోఘ్ భత్కల్, సువేద్ పార్కర్, ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, అథర్వ అంకోలేకర్, మోహిత్ అవస్తి, ధావల్ అవస్తి, రాయ్‌స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరగనుంది.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్ షెడ్యూల్..

తొలి టెస్ట్: జనవరి 25-29, హైదరాబాద్

రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-06, విశాఖపట్నం

మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్

నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27, రాంచీ

ఐదో టెస్ట్: మార్చి 07-11, ధర్మశాల

Story first published: Tuesday, January 9, 2024, 22:28 [IST]
Other articles published on Jan 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+