Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens T20 World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక స్పిన్నర్ ఔట్!

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ చీలమండ గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో ప్రేమా రావత్‌ను జట్టులోకి తీసుకున్నారు.

నెదర్లాండ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బంతిని అడ్డుకునే ప్రయత్నంలో శ్రేయాంక పాటిల్ కుడి చీలమండకు తీవ్ర గాయమైంది. తీవ్ర నొప్పితో బాధపడిన ఆమె కనీసం నడవలేకపోవడంతో స్ట్రెచర్ సాయంతో స్టేడియం బయటకు తీసుకెళ్లారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్ట్‌ల్లో ఆమె చీలమండ స్నాయువు చిరిగిపోయినట్లు తేలింది. ఫలితంగా ఆమె ఈ టోర్నీ మొత్తానికి దూరమైంది.

T20 WC 2026: నిప్పులు చెరిగిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం!

T20 WC 2026: నిప్పులు చెరిగిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం!

ఐసీసీ ప్రకటన..

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఐసీసీ ప్రకటనను విడుదల చేసింది. 'ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 'ఈవెంట్ టెక్నికల్ కమిటీ' భారత జట్టులో శ్రేయాంక పాటిల్ స్థానాన్ని ప్రేమ రావత్‌తో భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయాంక కుడి మడమకు గాయం కావడంతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది.

Women s T20 World Cup Shreyanka Patil Ruled Out Due to Ankle Injury Uncapped Leg-Spinner Prema Rawat Named Replacement

ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో రావత్‌ను జట్టులోకి తీసుకున్నారు.' అని ఐసీసీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. గతంలో చేతి వేలికి ఫ్రాక్చర్ కావడం వల్ల 2024 ప్రపంచకప్‌కు దూరమైన 23 ఏళ్ల శ్రేయాంక పాటిల్.. ఇప్పటి వరకు 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీసింది.

ప్రేమ రావత్ ఎవరంటే..?

శ్రేయాంక పాటిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక లెగ్ స్పిన్నర్. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుంది. భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఆమెకు తొలిసారి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈ టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్‌పై భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు శ్రేయాంక పాటిల్ దూరమవ్వడం భారత్‌‌ను కలవరపెడుతోంది.

టీమిండియాకు బిగ్ షాక్.. స్ట్రెచర్‌పై వెళ్లిన స్టార్ స్పిన్నర్!

టీమిండియాకు బిగ్ షాక్.. స్ట్రెచర్‌పై వెళ్లిన స్టార్ స్పిన్నర్!
Story first published: Friday, June 19, 2026, 11:55 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+