Shree Charani: డజన్ వికెట్లతో చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి!
టీమిండియా స్పిన్నర్, తెలుగు తేజం శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీయడం ద్వారా శ్రీ చరణి ఈ ఫీట్ సాధించింది.
ఈ టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. ఈ రెండు వికెట్లను ఆఖరి ఓవర్‌లో సాధించింది. ఆమె బౌలింగ్‌లో ధాటిగా ఆడబోయిన షోర్నా అక్తెర్, నహిదా అక్తెర్ వికెట్ పారేసుకున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మూడు వికెట్ల ఘనతను అందుకుంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టింది.

19 ఏళ్లలో తొలి ఆసియా ప్లేయర్‌గా..
ఈ టోర్నీలో రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న శ్రీచరణి మొత్తం 12 వికెట్లతో సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్‌గా నిలిచింది. 17 ఏళ్ల మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే మరే ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఈ క్రమంలో ఆమె భారత బౌలర్ పూనమ్ యాదవ్ రికార్డ్‌ను అధిగమించింది. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పూనమ్ యాదవ్ 10 వికెట్లు తీసింది. ఈ జాబితాలో డయానా డేవిడ్(9-2010), పూనమ్ యాదవ్(8-2014), పూనమ్ యాదవ్(8-2018), రాధా యాదవ్(8-2018), ఫాతిమా సనా(8-2026) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంతేకాకుండా సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్‌గా కూడా శ్రీచరణి నిలిచింది. పూనమ్ యాదవ్(2014, 2018), రాధా యాదవ్(2018), రేణుకా ఠాకూర్(2024) ఈ ఫీట్ సాధించారు. పాకిస్థాన్ ప్లేయర్ అలియా రియాజ్(2018), ఫతిమా సనా(2026), సాదికా ఇక్బాల్(2026) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..
శ్రీచరణి(2/21) అద్భుత ప్రదర్శనతో పాటు షెఫాలీ వర్మ(34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులే చేసింది. జుయారియా ఫెర్డోస్(31 బంతుల్లో 5 ఫోర్లతో 33), నిగర్ సుల్తానా(27 బంతుల్లో 4 ఫోర్లతో 32), సోభనా మోస్ట్రే(26 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్(3/28) మూడు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, నందని శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మతో పాటు యస్తికా భాటియా(18 బంతుల్లో 3 ఫోర్లతో 23), జెమీమా రోడ్రిగ్స్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితూ మోనీ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తెర్, రాబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు. నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టీమిండియా గ్రూప్-1లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

