Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2026: నిప్పులు చెరిగిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయాన్నందుకుంది. బుధవారం నెదర్లాండ్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 74), షెఫాలీ వర్మ(38 బంతుల్లో 10 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రిచా ఘోష్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లెంగే(2/32) రెండు వికెట్లు తీయగా.. ఇరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, మిర్తే వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీసారు.

Womens T20 World Cup 2026 Shree Charani 4-Wicket Haul and Mandhana s 74 Power India Beat Netherlands

అనంతరం నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. బాబెట్ డీ లీడే(27 బంతుల్లో 3 ఫోర్లతో 28), హీథర్ సీగర్స్(16 బంతుల్లో 4 ఫోర్లతో 21) మినహా అంతా విఫలమయ్యారు. తెలుగు తేజం శ్రీచరణి(4/19) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. షెఫాలీ వర్మ(3/20) మూడు వికెట్లు పడగొట్టింది. నందని శర్మకు రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది.

పాకిస్థాన్‌తో గత మ్యాచ్‌లో 64 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. తాజా మ్యాచ్ 95 పరుగులతో విజయం సాధించడంతో రన్‌రేట్ భారీ స్థాయిలో ఉంది. గ్రూప్-1లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Story first published: Thursday, June 18, 2026, 9:43 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+