
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) సంచలన నిర్ణయం తీసుకుంది. సరిగ్గా సీజన్ ప్రారంభానికి 10 రోజుల ముందు తమ కెప్టెన్‌ను మార్చేసింది. సంజూ శాంసన్‌పై వేటు వేస్తూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను నూతన కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని బుధవారం ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు కాదు. కోతి పనులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అల్లరి పిల్లోడు యుజ్వేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌నే హ్యాక్ చేసిన యుజ్వేంద్ర చాహల్ ఇక నుంచి తానే కెప్టెన్ అని ప్రకటించుకున్నాడు. ఇక ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసిన విషయాన్ని యుజీ చాహల్ తన ట్విటర్ వేదికగా తెలియజేశాడు. టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తెలిసే యూజీ చాహల్ ఈ పనిచేసినట్లు అర్థం అవుతోంది. సరదా కోసం ఈ పని చేసి అభిమానులను ఫూల్ చేయాలనుకున్నారేమో.
ఇక చాహల్ చేసిన ఈ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న కొంత మంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇదే నిర్ణయం అవాక్కయ్యారు. కానీ కొందరు మాత్రం ఇది అల్లరి పిల్లోడు చాహల్ పనే అయ్యుంటుందని గ్రహించారు. వెంటనే అతని ట్విటర్ హ్యాండిల్‌ను చేక్ చేసి కన్ఫామ్ చేసుకున్నారు. ఆర్‌ఆర్ ట్విటర్ హ్యాండిల్‌ను చేసే వ్యక్తి నుంచి పాస్ వర్డ్ తీసుకున్న చాహల్.. ఈ పని చేశాడు. తన ట్విటర్ వేదికగా పాస్ వర్డ్ ఇచ్చిన వ్యక్తికి ధన్యవాదాలు కూడా తెలిపాడు.
ఇక ఆర్ ఆర్ ట్విటర్ హ్యాండిల్‌ను తానే మెయింటేన్ చేస్తానన్న చాహల్.. ఆ వెంటనే కెప్టెన్సీ మార్పు ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా తాను బ్యాటింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. 10వేల రీట్వీట్స్ వస్తే జోస్ బట్లర్ అంకుల్‌తో కలిసి ఓపెన్ చేస్తానని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ముంబైలో టీమ్‌తో ఉన్న చాహల్.. ఆర్ఆర్ ట్విటర్ హ్యాండిల్‌ను ఓ ఆట ఆడుకుంటున్నాడు.
తనదైన ట్వీట్స్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. గత సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్.. రూ. 6.5 కోట్ల తక్కువ ధరకే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఇప్పటికే ముంబై చేరిన రాజస్థాన్ రాయల్స్.. ప్రాక్టీస్ మొదలుపెట్టింది.