Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియా మీర్జాతో విడాకులపై స్పందించిన షోయబ్ మాలిక్.. ఏమన్నాడంటే?

Shoaib Malik speaks-up on Divorce rumors with his wife Sania Mirza

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌లు విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.12 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఈ స్టార్ కపుల్ సిద్దమైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని పుకార్లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ పుకార్లపై షోయబ్ మాలిక్ స్పందించాడు. ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ.. విడాకుల అంశం తమ వ్యక్తిగతమని తెలిపాడు. దీనిని ఇక్కడితో వదిలేయాలని మీడియాను, అభిమానులను కోరాడు.

దయచేసి వదిలేయండి..

దయచేసి వదిలేయండి..

ఈ అంశంపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. విడాకులపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సానియా మీర్జా కూడా ఎలాంటి సమాధానం చెప్పబోదని పేర్కొన్నాడు. 'ఇది మా వ్యక్తిగత వ్యవహారం. నేను కానీ నా సతీమణి గానీ ఈ విడాకుల వార్తలపై సమాధానం చెప్పదు. మమ్మల్ని వదిలేయండి'అని మాలిక్ పేర్కొన్నాడు. మరోవైపు వీరిద్దరి మధ్య విడాకుల అంశం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

న్యాయపరమైన చిక్కులతోనే..

న్యాయపరమైన చిక్కులతోనే..

వివిధ షోలు, కార్యక్రమాల కోసం ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ జంట విడాకుల నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అవన్నీ తొలగిన తర్వాత 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ వీరిద్దరూ ప్రకటిస్తారని సమాచారం. విడిపోయిన తర్వాత తనయుడు ఐజాన్‌ సంరక్షణ బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం..

విడాకులు తీసుకోవడం షోయబ్‌కు ఇష్టం లేకపోయినా.. సానియా మీర్జానే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. షోయబ్ మాలిక్ మోసం చేయడంతోనే సానియా మీర్జా ఈ కఠిన నిర్ణయం తీసుకుందనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఓ మోడల్‌తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేత సంబంధమే సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసాయని తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెతో చనువుగా దారి తీసిందని ప్రచారం జరుగుతోంది. ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేసాడట. ప్రతీ విషయం సానియాతో షేర్ చేసుకునే మాలిక్.. ఈ వ్యవహారం మాత్రం దాచి పెట్టడట. దాంతో ఆగ్రహానికి గురైన సానియా విడాకులు తీసుకోవడానికి సిద్దమైందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.

ది మీర్జా మాలిక్ షో..

ది మీర్జా మాలిక్ షో..

సానియా, షోయబ్ మాలిక్ ఉర్దూ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వచ్చే ఓ టీవీ టాక్ షో‌లో హోస్ట్‌లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు 'ది మీర్జా మాలిక్ షో' అని పేరు పెట్టగా.. ఈ షో ప్రొమోను షోయబ్ మాలిక్ షేర్ చేశాడు. ఈ షో కోసమే సానియా-మాలిక్ విడాకుల నాటకం ఆడారని కూడా ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారని సమాచారం. ఈ షోల వల్లనైనా.. వీరి మనసులు మళ్లీ కలవాలని, షోయబ్ తప్పిదాన్ని సానియా క్షమించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Sunday, December 11, 2022, 10:10 [IST]
Other articles published on Dec 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+