For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shoaib Malik: సానియా మీర్జా మాజీ మొగుడికి నాలుగో పెళ్లి.?

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి సిద్దమయ్యాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలను షోయబ్ మాలిక్ ఖండించాడు. ఇవి పూర్తిగా అవాస్తవమని, కల్పితమైనవని స్పష్టం చేశాడు. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని నెటిజన్లను కోరాడు.

సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ 2023లో విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ నటి సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ సీక్రెట్ ఎఫైర్ నడపడాన్ని గుర్తించిన సానియా మీర్జా.. అతన్ని వదిలేసి భారత్‌కు తిరిగొచ్చింది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య భర్తలుగా విడిపోయినా.. కొడుకు కోసం తల్లిదండ్రులుగా కొనసాగాలని వీరు నిర్ణయం తీసుకున్నారు.

సానియాతో విడాకుల అనంతరం షోయబ్ మాలిక్ 2024 జనవరిలో కరాచీలో సనా జావెద్‌ను మూడో వివాహం చేసుకున్నాడు. సానియా మీర్జాకు ముందు షోయబ్ మాలిక్ ఒకరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Shoaib Malik Slams Fourth Marriage Rumors Former Captain Warns of Legal Action Over Fake News

అయితే సనా జావెద్‌‌తో కూడా షోయబ్ మాలిక్ దూరంగా ఉంటున్నాడని, మరో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై షోయబ్ మాలిక్ అధికారికంగా స్పందించాడు. ఈ వార్తలను ఖండిస్తూ.. ప్రకటనను విడుదల చేశాడు. అసత్య వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

'సానియా మీర్జాతో నా వివాహం 2023లోనే ముగిసింది. పరస్పర అంగీకారంతో విడిపోయిన మేం.. మా బిడ్డను కలిసి పెంచాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాతే నేను మరో వివాహం చేసుకున్నాను. నా కుటుంబం పట్ల గౌరవం కారణంగా నా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ, చాలామంది నా మౌనాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.

ఇప్పుడు కూడా నేను నోరు తెరవడానికి నా కొడుకే కారణం. నా పెళ్లి గురించి వదంతులు హద్దులు మీరుతున్నాయి. లైక్స్, వ్యూస్ కోసం అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నా కొడుకు ఈ కథనాలను చదివే వయసులో ఉన్నాడు.

ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు నా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు మానసిక వేదనను కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లైక్స్, వ్యూస్ కంటే చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. మీలాగే నాకు కూడా ఒక కుటుంబం ఉంది. నా ఈ వివరణ తర్వాతైనా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు ఆగిపోతాయని ఆశిస్తున్నా. ఒకవేళ నా విజ్ఞప్తిని కూడా లెక్క చేయకుండా ఇలాంటి పుకార్లనే సృష్టిస్తే.. నా లీగల్ టీమ్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటా.’అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో హెచ్చరించాడు.

Story first published: Sunday, March 1, 2026, 11:47 [IST]
Other articles published on Mar 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+