For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కొడుకు నన్ను నాన్న అని పిలవడు: షోయబ్ మాలిక్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. మరో పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. మరోవైపు సానియా మీర్జా మాత్రం తన ఏడేళ్ల కుమారుడు ఇజాన్ మీర్జాతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. అయితే తన కొడుకు తనను ’నాన్న’అని పిలవడని, బ్రో అని పిలుస్తాడని షోయబ్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సానియా మీర్జాతో విడిపోయినా.. తన కొడుకు ఇజాన్‌తో సన్నిహితమైన బంధాన్ని కొనసాగిస్తున్నానని చెప్పాడు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ.. ప్రతీ రోజు వీడియో కాల్ మాట్లాడుతానని వెల్లడించాడు.

'సానియా మీర్జాతో విడిపోయినా ఇజాన్‌‌తో సన్నిహితమైన బంధాన్ని కొనసాగిస్తున్నాను. ఇజాన్‌ను చూసేందుకు ప్రతీ నెలలో రెండు సార్లు దుబాయ్‌కి కూడా వెళ్తాను. ఆ సమయంలో నేనే స్వయంగా ఇజాన్‌ను స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకువస్తాను. ఇజాన్‌తో కలిసినప్పుడు మేమిద్దరం చాలా మాట్లాడుకుంటాం. క్రీడలతో పాటు అనేక విషయాలు చర్చించుకుంటాం. ఇజాన్‌తో ఓ తండ్రిగా కాకుండా ఫ్రెండ్‌లా ఉంటాను. అతను కూడా నన్ను తండ్రిగా కాకుండా స్నేహితుడిలానే చూస్తాడు. ఇజాన్ తనను డాడీ అనకుండా బ్రో అని పిలుస్తాడు. నేను కూడా అలాగే పిలుస్తాను'అని షోయబ్ మాలిక్ ఓ పాకిస్థాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Shoaib Malik Reveals His Son Izhaan Doesn t Call Him Papa After Divorce With Sania Mirza

గతేడాదే సానియా మీర్జా- షోయబ్ మాలిక్‌లు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఖులా ద్వారా ఈ ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇజాన్ కస్టడా తల్లి సానియాకు దక్కింది. మరోవైపు షోయబ్ మాలిక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అంతర్జాతీయంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కామెంటేటర్‌గా కూడా కనిపించాడు.

మరోవైపు ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన సానియా మీర్జా కూడా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఆమె పికిల్ బాల్ ఓపెన్ 2025 టోర్నీ కోసం గ్లోబర్ స్పోర్ట్స్‌లో భాగస్వామిగా చేరింది. ఈ టోర్నీ మే 8 నుంచి 11 వరకు దుబాయ్ వేదికగా జరగనుంది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్‌ను పోలీ ఉండే పికిల్ బాల్‌ వృద్ధికి సానియా కృషి చేస్తోంది.

Story first published: Thursday, March 20, 2025, 17:56 [IST]
Other articles published on Mar 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+