Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: బాబర్.. కెప్టెన్సీ నుంచి తప్పుకో!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కీలక సలహా ఇచ్చాడు. పాకిస్థాన్ వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్సీ వదిలేసి బ్యాటర్‌గా కొనసాగాలని బాబర్ ఆజామ్‌కు సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఘోర పరాజయాలను చవిచూసింది.

పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్.. గత ఆదివారం భారత్ చేతిలో ఖంగుతిన్నది. ఈ వరుస పరాజయాలతో పాకిస్థాన్ జట్టు, బాబర్ ఆజామ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Shoaib Malik Demands Babar Azam Step Down As Pakistan Captain after Defeat vs India In T20 WC 2024

ముఖ్యంగా భారత్ విధించిన 120 పరుగుల లక్ష్యాన్ని అందుకోకపోవడంపై పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. జట్టు మొత్తం మార్చేయాలని వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు పీసీబీకి సూచించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజామ్‌‌ను కెప్టెన్సీ వదిలేయాలని షోయబ్ మాలిక్ కోరాడు.

'కెప్టెన్సీ వదిలేయాలని బాబర్ ఆజామ్‌కు చాలా రోజులుగా చెబుతున్నా. బాబర్ ఆజామ్ క్లాస్ ప్లేయర్. ఆ క్లాస్‌ను మాత్రమే అతను చూపించాలి. కెప్టెన్సీ అనే అదనపు బాధ్యతలు అతనికి అనవసరం. కెప్టెన్సీ ఒత్తిడి లేకుంటే అతను ఇంకా బాగా ఆడగలడు. కెప్టెన్సీ వదిలేసేదాకా అతనికి కష్టాలు తప్పవు.

భారత్‌తో 120 పరుగుల లక్ష్యాన్ని చేధించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. లోస్కోరింగ్ గేమ్‌లో స్ట్రైక్‌రేట్ మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఏం ఉంది. ఎవరైనా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలి. కానీ ఎవరూ కూడా ఓ ప్లాన్‌తో బ్యాటింగ్ చేయలేదు. అసలు రిజ్వాన్ ఆ షాట్ ఎందుకు ఆడాడో కూడా అర్థం కావడం లేదు.

భారత్ తమ ప్రధాన బౌలర్‌ను రంగంలోకి దించిందంటేనే వికెట్ కోసం. ఆ విషయం అర్ధం చేసుకోకుండా గుడ్డిగా షాట్ ఆడటం ఏంటో అతనికే తెలియాలి. పీఎస్‌ఎల్ ఆడిన అనుభవం ఉన్న రిజ్వాన్ అలా ఆడటం ఆశ్చర్యానికి గురి చేసింది.'అని షోయబ్ మాలిక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, June 11, 2024, 19:21 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+