Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shoaib Malik: చరిత్ర సృష్టించిన కొత్త పెళ్లి కొడుకు

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మూడో పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే షోయబ్ మాలిక్ ఈ ఫీట్ సాధించడం విశేషం. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌‌ను వివాహమాడాడు.

గత కొన్నేళ్లుగా ఆమెతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జా విడాకులు ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నాడు. తన మూడో పెళ్లికి సంబంధించిన ఫొటోలను శనివారమే అభిమానులతో పంచుకున్నాడు.

Shoaib Malik creates history by crossing 13000 runs in T20 Cricket

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) ఆడుతున్న షోయబ్ మాలిక.. ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాంగ్‌పూర్ రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 18 బంతుల్లో 17 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా టీ20 కెరీర్‌లో 13 వేల పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(14.562) తర్వాత షోయబ్ మాలిక్(13,010) ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఫీట్ సాధించారు. ఇప్పటి వరకు షోయబ్ మాలిక్ 526 మ్యాచ్‌లు ఆడాడు. 124 అంతర్జాతీయ టీ20ల్లో 2,435 పరుగులు చేశాడు. మిగతావన్నీ ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన మాలిక్.. పీఎస్‌ఎల్, సీపీఎల్, బీపీఎల్‌తో పాటు ఇతర టోర్నీల్లో బరిలోకి దిగాడు.

అంతర్జాతీ టెస్ట్‌లు, వన్డేలకు ఎప్పుడో వీడ్కోలు పలికిన షోయబ్ మాలిక్ టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతూనే.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Shoaib Malik creates history by crossing 13000 runs in T20 Cricket

2010లో ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో కొడుకు పుట్టాడు. ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.

తన కూతురు 41 ఏళ్ల షోయబ్ మాలిక్‌తో ముస్లిం చట్టం 'ఖులా' ప్రకారం విడాకులు తీసుకుందని మీడియాకు తెలిపారు. ఖులా అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం. దీని ద్వారా ఓ ముస్లిం మహిళ తన భర్త నుంచి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు.

Story first published: Sunday, January 21, 2024, 12:12 [IST]
Other articles published on Jan 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+