భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నవ్వులు పూయించింది.
రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో రవీంద్ర జడేజా వేసిన 103 ఓవర్‌లో ఓలీ రాబిన్సన్ ఔటవ్వగా.. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసేందుకు రెడీ అయిన సర్ఫరాజ్ ఖాన్.. జడేజాతో.. 'వీడికి హిందీ రాదన్నా'అని అన్నాడు.

ఈ మాటలు విన్న బషీర్ కొంచెం హిందీ తెలుసని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన చోటు చేసుకున్న కాసేపటికే బషీర్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
302/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది.
51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్(0)లను ఔట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర చంద్ర అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోయింది. అండర్సన్ బౌలింగ్‌లో రోహిత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 34/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. క్రీజులో యశస్వి జైస్వాల్(27)తో పాటు శుభ్‌మన్ గిల్(4) ఉన్నారు.