For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరో చెప్పిన అక్తర్

Shoaib Akthar picks India’s ‘X-factor’ after series sweep

కరాచీ: న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ అద్భుత విజయంతో 5 టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని తాను ఏ మాత్రం ఊహించలేదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించాడు.

తొలి 10 ఓవర్ల వరకూ మ్యాచ్‌ ఆతిథ్య న్యూజిలాండ్ చేతుల్లోనే ఉందని, ఆ తర్వాత భారత్‌ అనూహ్యంగా తిరిగి పుంజుకుందన్నాడు. దీనికి కారణం టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అని ఈ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ చెప్పుకొచ్చాడు. ఓటమి అంచుకు చేరిన భారత్ విజయాన్నందుకుందంటే అది బుమ్రా బౌలింగ్ క్రెడిటేనని అక్తర్ విశ్లేషించాడు.

బుమ్రా టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ (ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తి) అని ప్రశంసించాడు. అతను ఎంతటి నాణ్యమైన బౌలరో అని మరొకసారి ప్రపంచానికి తెలియజేశాడని కొనియాడాడు.

'బుమ్రా ఓ అసాధారణమైన ఆటగాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత రెండు మూడు మ్యాచ్‌ల్లోనే అతను లయ అందుకున్నాడు. కానీ కొంతమంది బౌలర్లు చాలా సమయం తీసుకుంటారు. ఇక బుమ్రా తొందరగా పూర్తి స్వింగ్‌ను అందిపుచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ రోజు అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
3 వికెట్లు..12 పరుగులు సూపర్ బౌలింగ్‌. బుమ్రా ఎప్పుడూ డెత్‌ ఓవర్లలో 25-30 పరుగులు ఇచ్చి న దాఖలాలు లేవు. సైనీ, శార్దూల్‌లు మెరుగైన బౌలింగ్‌ వేసినా, టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బుమ్రానే.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఆఖరి టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బుమ్రా ఒక మెయిడిన్‌ ఓవర్‌తో 12 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆద్యాంతం ఆసక్తిగా సాగిన ఆఖరి టీ20లో సమష్టి‌గా రాణించిన భారత్ 7 పరుగులతో గెలుపొందింది. ఇక ఎప్పటిలానే కివీస్ అలవోకగా గెలిచే మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (45) తన ఫామ్‌ను కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమి పాలైంది టిమ్ సీఫెర్ట్(50), రాస్ టేలర్(52 ) అద్భుత ప్రదర్శన కనబర్చినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో బుమ్రా (3/12) మూడు వికెట్లకు అండగా.. సైనీ, ఠాకుర్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించగా.. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

Story first published: Monday, February 3, 2020, 14:23 [IST]
Other articles published on Feb 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+