Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డికాక్ చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు.. అతని తీరు క్రీడా స్పూర్తికి విరుద్దం : షోయబ్ అక్తర్ ఫైర్

Shoaib Akhtar says What Quinton de Kock did was not in the good spirit of the game

కరాచీ: సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో డికాక్ ప్రవర్తించిన తీరు చిన్నపిల్లాడిలా ఉందని, అతని తీరు క్రీడా స్పూర్తికి విరుద్దమన్నాడు. అయితే అతను చీటింగ్ చేశాడని మాత్రం తాను అనుకోవడం లేదని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్(155 బంతుల్లో18 ఫోర్లు, 10 సిక్స్‌లతో 193) డికాక్ కారణంగా రనౌటయ్యాడు. దాంతో ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..?

అసలు ఏం జరిగిందంటే..?

పాక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ తొలి బంతిని ఫకర్ జమాన్ లాంగాఫ్ దిశగా హిట్ చేసి.. సింగిల్.. ఆ వెంటనే డబుల్ కోసం పరుగెత్తాడు. అయితే.. అతను పిచ్ మధ్యలో ఉండగానే కీపర్ డికాక్ తన బుర్రకి పదునుపెట్టాడు. తెలివిగా బంతిని బౌలర్ ఎండ్ వైపు వేయాలని ఫీల్డర్‌కు సూచిస్తూ ఫకర్‌ను బోల్తా కొట్టించాడు. డికాక్ మాటలను నమ్మిన ఫకర్ పిచ్ మధ్యలో బౌలర్ ఎండ్‌వైపు చూస్తూ సమయాన్ని వృథా చేశాడు. దాంతో బంతిని అందుకున్న డికాక్ సెకన్ల వ్యవధిలోనే వికెట్లకు కొట్టేసి ఫకర్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే డికాక్ ఉద్దేశపూర్వకంగానే ఫకర్ జమాన్‌ దృష్టి మరల్చాడని, ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని పాక్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్తర్.. తన యూట్యూబ్ చానెల్‌ వేదికగా డికాక్ తీరును తప్పుబట్టాడు.

ఏమాత్రం సమంజసం కాదు..

ఏమాత్రం సమంజసం కాదు..

'మైదానంలో డికాక్ చేసిన పనిని చీటింగ్ అనను. కానీ ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఆట యొక్క గొప్పతనాన్ని దెబ్బతీయడమే. దీన్ని నేనేమాత్రం ఆమోదించను. డికాక్ ఓ గొప్ప క్రికెటర్. అతను ఇలా చేయాల్సింది కాదు. ఆ టైమ్‌లో ఫకర్.. బంతిని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వేస్తారనుకున్నాడు. క్వింటన్ కూడా ఉద్దేశ పూర్వకంగానే అలా చేశాడు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక ట్విటర్ వేదికగా దీనిపై ఈ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ క్వశ్చన్ పోల్ పెట్టగా.. 56.4 శాతం మంది డికాక్ చేసిన పనిని తప్పుబట్టారు.

అంపైర్లకే నిబంధనలు తెలియవు..

అంపైర్లకే నిబంధనలు తెలియవు..

ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ మిస్సవడం తనను చాలా హార్ట్ చేసిందని అక్తర్ చెప్పుకొచ్చాడు. పాక్ తరఫున రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిన ఫకర్ జమాన్‌ను చూడాలనుకున్నానని, కానీ ఆ మ్యాచ్‌లో ఎవరికీ ఆట పట్ల కనీస అవగాహన లేదన్నాడు. 'ఫకర్ డబుల్ మిస్సవడం బాధకు గురిచేసింది. ఎందుకంటే పాక్ తరఫున రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా అతన్ని చూడాలనుకున్నా. నిబంధనల ప్రకారం పెనాల్టీ రన్స్ ఇస్తే పాక్ సులువుగా గెలిచేది. కానీ అంపైర్లకు గేమ్ పట్ల అవగాహన లేకపోవడం నిరాశకు గురిచేసింది'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ నిబంధనల మేరకు..

ఐసీసీ నిబంధనల మేరకు..

ఐసీసీ రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బాల్‌ను అందుకున్న తర్వాత ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా తన మాటలు లేదా చేతల ద్వారా బ్యాట్స్‌మన్ దృష్టి మరల్చకూడదు. అలా చేస్తే నాటౌట్ ఇవ్వడంతో పాటు ఐదు రన్స్ పెనాల్టీ విధించాలి. అయితే, ఈ ఘటనతో డికాక్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడో లేదో తేల్చాల్సింది ఫీల్డ్ అంపైర్లే అని ఎంసీసీ పేర్కొంది. మరోవైపు డికాక్ ఇక్కడ తెలివిగా ప్రవర్తించాడని సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా తెలిపాడు. అతను జమాన్ దృష్టి మరల్చలేదని, బ్యాకప్‌గా ఫీల్డర్ రావాలని సూచించాడని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 6, 2021, 13:42 [IST]
Other articles published on Apr 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+