చాలా సంతోషంగా ఉంది.. మా చెత్త రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది: అక్తర్

అడిలైడ్: టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. పేసర్ మొహ్మద్ షమీ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. టెస్టు చరిత్రలో భారత జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అయితే టెస్టు చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోరు మాత్రం ఆస్ట్రేలియా ఖాతాలోనే ఉన్నది. 1955లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 26 పరుగులకే ఆలౌటైంది.

పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 49
భారత్ అత్యల్ప స్కోరుకే ఆలౌట్ కావడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు తమ దేశ రికార్డును బద్దలు కొట్టిందని, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. 2013లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 49 నమోదు చేసింది. దారుణ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన భారత ఆటగాళ్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉండాలని అక్తర్ సూచించాడు.

369 కాదు.. 36/9
'నిన్న రాత్రి మ్యాచ్ చూడలేకపోయా. అందుకే ఈరోజు ఉదయం నిద్రలేవగానే టీవీ ఆన్ చేశాను. స్కోర్ బోర్డు మీద టీమిండియా స్కోరు 369 అని ఉందనుకున్నా. వెంటనే కళ్లు నులుముకుని జాగ్రత్తగా చూశా. అది 369 కాదు.. 36/9. ఒక రిటైర్డ్ ఔట్. అది పూడ్చలేని నష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్ తీరు ఇలా అయిపోయింది' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.

చాలా సంతోషంగా ఉంది
'భారత్ మా రికార్డును కూడా బద్దలు కొట్టారు. 36 ఆలౌట్! ఇది చెత్త ప్రదర్శన. దారుణమైనది. కానీ భారత్ మా (పాకిస్తాన్) రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఇలాంటివి క్రికెట్‌లో సహజం. ఓటమితో పాటు విమర్శలను భరించండి. ఇప్పుడు ఇదే జరగబోతోంది. సిద్ధంగా ఉండండి. బలమైన భారత జట్టు కూలిపోతోంది. మొత్తానికి ఇదొక బ్యాడ్ న్యూస్' అని అక్తర్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

పాక్ 29.1 ఓవర్లలలో 49 రన్స్
ప్రపంచ మేటి జట్లను వణికించన దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. అద్భుతమైన పేసర్లు, బ్యాట్స్‌మెన్ మీదకు దూసుకొచ్చే బంతులు విసిరే స్పీడ్‌స్టర్లకు ఒకప్పుడు అది చిరునామా. ఇప్పటి వరకు 431 టెస్టులు ఆడిన పాక్ 138 గెలిచి 131 ఓడింది. 162 మ్యాచులు డ్రా చేసుకుంది. అయితే టెస్టుల్లో దాని అత్యల్ప స్కోరు 49. జోహన్స్‌బర్గ్ వేదికగా 2013లో దక్షిణాఫ్రికా చేతిలో ఆ పరాభవం ఎదురైంది. మొదట సఫారీలు 253 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 29.1 ఓవర్లకే 49కే కుప్పకూలింది. డేల్ స్టెయిన్ 6/8, ఫిలాండర్ 2/16, జాక్వెస్ కలిస్ 2/11 వణికించారు.
India vs Australia: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications