Shoaib Akhtar: ఆ ఇద్దరు ఆంటీలు రోజు రెచ్చగొట్టేవారు!

కరాచీ: షోయబ్ అక్తర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ముద్దుగా పిలుచుకనే ఈ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. తన హయాంలో వేగవంతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అక్తర్ తాజాగా స్పోర్ట్స్ కీదా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ జీవితానికి సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ క్రికెటర్‌గా ఎదగడానికి ఓ ఇద్దరు ఆంటీలు కారణమని చెప్పాడు. రోజు వారు తనని రెచ్చగొట్టేవారని, వారి మాటలతో మరింత కసిగా ప్రాక్టీస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ఆంటీలే కాకుండా చుట్టు పక్కళ్ల వాళ్లు కూడా నీకు క్రికెటర్ అయ్యేంత సీన్ లేదనేవారని, వారి మాటలే తనలో మరింత కసిని రగిల్చాయని గుర్తు చేసుకున్నాడు.

క్రికెటర్ అయ్యేంత సీన్ లేదన్నారు..
'నా కెరీర్ ఆరంభంలో జరిగిన కథ ఇది. రావల్పిండి తరఫున నేను ట్రయల్స్‌కు హజరవుతున్న రోజులవి. చుట్టు పక్కలవాళ్లు నాకు క్రికెటర్ అయ్యేంత సీన్ లేదనేవారు. వారి మాటలకు నాకు ఆగ్రహం తెప్పించేవి. ఎందుకు అలా అంటున్నారని ఎదురు ప్రశ్నించేవాడిని. నీలో అంత ప్రతిభ మాకు కనిపించలేదని చెప్పేవారు. నా సత్తా ఏంటో చూపిస్తా మీ అందరికి అని సవాల్ విసిరేవాడిని. కానీ అది చాలా కష్టమనేవారు. మా ఏరియాకు చెందిన వారు కూడా అలానే అంటూ నన్ను నిరుత్సాహ పరిచేవారు.

ఆంటీలు అవహేళన చేసేవారు..
ముఖ్యంగా మా ఏరియాకు చెందిన ఇద్దరు ఆంటీలు అయితే నన్ను అవహేళన చేసేవారు. నేను ప్రాక్టీస్ వెళ్లేటప్పుడు రోజు తమ మాటలతో రెచ్చగొట్టేవారు. ఎక్కడికి వెళ్తున్నావని రోజు అడిగేవారు. నేను స్టార్ అవుదామని వెళ్తున్నా అని చెప్పేవాడిని. కానీ వారి మాటల ఉద్దేశం నాకు తెలుసు. నేనో స్టార్ ప్లేయర్ కావాలని వారు అలా రెచ్చగొట్టేవారు. ప్రతీ రోజు నన్ను ఎగతాళి చేస్తూ అవహేళన చేసేవారు. ప్రతీ రోజు నువ్వు స్టార్ కాలేవనేవారు. కొద్ది రోజులు ఆగండి. నేను ఈ దేశానికి బిగ్ స్టార్ అవుతానని బదులిచ్చేవాడిని'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరు తమ్ముడిలా..
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని ఇటీవల అక్తర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం గతంలో కూడా చెప్పాను. ఇక ముంబై వాసులతో కలవడం నాకెంతో ఇష్టం. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలిసినప్పుడు భద్రంగా చూసేవాళ్లు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లుగా భారత్‌కు రాలేదు. కానీ ఒకప్పుడు నన్ను అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అడిగేవారు. ఎందుకంటే నేనంతగా అక్కడ పనిచేశాను' అని అన్నాడు.

భారత్‌కు రావాలనుంది..
'భారత్‌లో నాకెన్నో మధురస్మృతులు ఉన్నాయి. నేను మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాలని ప్రార్థిస్తున్నాను. మరికొన్ని నెలల్లో భారత్, పాకిస్తాన్ సంబంధాలు మెరుగవ్వాలని కొన్ని రోజుల ముందే నా మిత్రులతో అన్నాను. అలా జరగ్గానే భారత్‌లో వాలిపోయే మొదటి పాకిస్థానీని నేనే అవుతా. అంతేకాదు టన్నుల కొద్దీ డబ్బు సంపాదించుకుంటా' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సరదాగా అన్నాడు. అక్తర్‌కు భారత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో అతడికి సన్నిహితులు బాగానే ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు.
అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications