For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటికి వచ్చేలా ఉంది: షోయబ్ అక్తర్

Shoaib Akhtar says Pakistan might get knocked out in first round of T20 World Cup after series defeat

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టేలా ఉందని ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో పాక్ టీమ్ ఆటను చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుందన్నాడు. సొంగడ్డపై చాలా రోజుల తర్వాత ఇంగ్లండ్‌తో ఏడు టీ20 సిరీస్ ఆడిన పాక్ 3-4తో ఓటమిపాలైంది. ఆదివారం కీలక ఫైనల్ మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ బలహీనతలను షోయబ్ అక్తర్ చర్చించాడు.

బౌన్సర్లు ఆడలేకపోతున్నారు..

బౌన్సర్లు ఆడలేకపోతున్నారు..

బాబర్‌ అజామ్, రిజ్వాన్‌తో పాటు పాకిస్థాన్‌ బ్యాటర్లందరినీ టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లతో పరీక్షిస్తారని అక్తర్‌ అన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తారని పాక్‌ బ్యాట్స్‌మన్‌ను అతను ప్రశ్నించాడు. 'నేను ఇంతకుముందే చెప్పినట్లు.. పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్నే నిష్క్రమిస్తుందన్న భయం కలుగుతోంది. ప్రపంచకప్‌లో మిగతా జట్లు పాకిస్థాన్‌పై ఏం చేయబోతున్నాయో అందరికీ తెలుసు. బాబర్, రిజ్వాన్, ఇఫ్తికార్‌.. ఇలా పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అందరికీ బౌన్సర్లు వేస్తారు. ఆస్ట్రేలియాలో బౌన్సర్లు వేయరని అనుకోవద్దు. అవి మాత్రమే వేస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు?'' అని అక్తర్‌ అన్నాడు. పాకిస్థాన్‌ మిడిల్‌ ఆర్డర్‌ బాగా లేదని, ఓపెనర్లు రాణించకపోతే ఒత్తిడికి గురవుతుందని చెప్పాడు.

చెత్త ఫీల్డింగ్‌తో..

చెత్త ఫీల్డింగ్‌తో..

ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హెర్రీ బ్రూక్(29 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాక్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 109 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ హస్నైన్ ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. మరో రెండు వికెట్లు రనౌట్ ద్వారా వచ్చాయి.

పేలవ బ్యాటింగ్..

పేలవ బ్యాటింగ్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. పాక్ జట్టులో షాన్ మసూద్(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరడగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రిజ్వాన్(1), బాబర్ ఆజామ్(4) ఘోరంగా విఫలమవ్వడంతో పాక్‌కు పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లే రెండు వికెట్లు పడగొట్టాడు. రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్, సామ్ కరన్ చెరొక వికెట్ తీసారు.

Story first published: Tuesday, October 4, 2022, 13:43 [IST]
Other articles published on Oct 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+