Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా రిస్క్ వద్దు.. టెస్ట్ క్రికెట్‌ను వదిలేయ్: షోయబ్ అక్తర్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ విచిత్రకరమైన సలహా ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని భారత స్టార్ పేసర్‌కు సూచించాడు. బుమ్రా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోని వైట్‌బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో కొనసాగితే బుమ్రా కెరీర్‌ దెబ్బతింటుందని హెచ్చరించాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగే సామర్థ్యం బుమ్రాకు లేదన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగాలనుకుంటే బౌలింగ్ వేగం పెంచాలని, ఎక్స్‌ట్రా పేస్ కోసం ప్రయత్నిస్తే గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అక్తర్.. బుమ్రా బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Shoaib Akhtar Says Jasprit Bumrah to quit Test cricket and Stick to shorter formats

'వన్డే, టీ20ల్లో బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ఎందుకంటే అతను లెంగ్త్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ పవర్ ప్లేలో.. డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ టెస్ట్ క్రికెట్‌లో మాత్రం సుదీర్ఘమైన స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాటర్లు డిఫెన్స్‌కు ప్రయత్నిస్తారు కాబట్టి ఎక్స్‌ట్రా పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లెంగ్త్‌తో పెద్దగా అవసరం ఉండదు. బౌలింగ్‌లో పేస్ లేకుంటే బంతి సీమ్, రివర్స్ స్వింగ్ కాదు. బౌలింగ్‌లో తడబడుతుంటే జనాలు ప్రశ్నించడం మొదలుపెడుతారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బుమ్రా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడమే ఉత్తమం. ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌లో అతను చాలా వికెట్లు తీసాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బుమ్రా దారుణంగా విఫలమయ్యాడు. ఒకవేళ బుమ్రా టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాలనుకుంటే బౌలింగ్‌లో వేగాన్ని పెంచాలి. పేస్‌ను పెంచితే గాయపడే ప్రమాదం పొంచి ఉంది. నేనే బుమ్రా ప్లేస్‌లో ఉంటే మాత్రం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పరిమిత ఓవర్లపై ఫోకస్ పెట్టేవాడిని.

నేను నా మనసు మాట వినేవాడిని. నేను బాగున్నానని భావిస్తేనే ఆడేవాడిని. బుమ్రా టెస్ట్‌ క్రికెట్ మాత్రమే ఆడితే సమస్య లేదు. కానీ అతను ఐపీఎల్‌తో పాటు వన్డేలు, టీ20లు, టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలనుకుంటున్నాను. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గాయాల బారిన పడకుండా చూసుకోవాలి.'అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా ఇప్పటికే 42 మ్యాచ్‌లు ఆడి 20.01 సగటుతో 185 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 400 ప్లస్ వికెట్లు పడగొట్టాడు. బుమ్రా నిలకడగా గంటలకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. అలాంటి బుమ్రా బౌలింగ్‌లో పేస్ లేదని అక్తర్ చెప్పడం హస్యాస్పదకంగా ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Saturday, December 14, 2024, 15:58 [IST]
Other articles published on Dec 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+