Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: అందుకే కోహ్లీ విఫలమవుతున్నాడు: షోయబ్ అక్తర్

టీ20 ప్రపంచకప్ 2024లో తన సహజ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తుండటంతోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. సహజంగా విరాట్ కోహ్లీ టైమ్ తీస్కోని భారీ షాట్లు ఆడుతాడని తెలిపాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా విరాట్ కోహ్లీ తాజా ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

2012 నుంచి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న విరాట్ కోహ్లీ గతంలో ఎప్పుడూ ఇంతలా విఫలమవ్వలేదు. 2022 వరకు కేవలం అతను రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమైతే తాజా ఎడిషన్‌లోనే ఐదు సార్లు సింగిల్ డిజిట్‌ స్కోర్లు చేశాడు. ఎక్స్‌ట్రా బౌలర్ కోసం కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేయగా.. అతను దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకుంటున్నాడు.

Shoaib Akhtar says I wish Rishabh Pant and Rohit Sharma could open and send Virat Kohli to No 3

దూకుడుగా ఆడబోయి..
ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.

టీమిండియా విజయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన షోయబ్ అక్తర్.. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి విరాట్ కోహ్లీని ఫస్ట్‌డౌన్‌లో ఆడించాలని సూచించాడు. టీమిండియాను చూసి సౌతాఫ్రికా భయపడుతోందన్నాడు.

టీమిండియాదే టైటిల్..
'ఫైనల్ చేరిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయానికి భారత ఆటగాళ్లు పూర్తి అర్హులు. నేను చాలా రోజులుగా ఇదే చెబుతున్నాను. గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ టీమిండియా విజేతగా నిలవాల్సింది. ఈ సారి కూడా టీమిండియానే విజేతగా నిలవాలి. ఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిస్తే తప్పకుండా ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.

వారికి ఇదే తొలి ఫైనల్ కాబట్టి సఫారీ ఆటగాళ్లపై కాస్త ఒత్తిడి ఉంటుంది. టీమిండియా తాజా విజయం చూసిన తర్వాత సౌతాఫ్రికా కూడా భయపడుతుంది. ఇలాంటి స్పిన్నర్లపై ఏ బ్యాటర్ రాణించగలడు? ఈసారి టీమిండియానే ఖచ్చితంగా విజేతగా నిలుస్తోంది.

పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలి..
ఫైనల్లో టీమిండియా వ్యూహాత్మక మార్పు చేయాలి. ఓపెనర్‌గా విఫలమవుతున్న విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్‌లో ఆడించాలి. రోహిత్ శర్మకు జతగా రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే తనకు అచ్చొచ్చిన నెంబర్ 3లో సహజ శైలిలో బ్యాటింగ్ చేస్తాడు. ప్రస్తుతం అతను తన సహజ శైలికి భిన్నంగా ఆడుతున్నాడు.

సహజంగా కోహ్లీ భారీ షాట్లు ఆడేందుకు టైమ్ తీసుకుంటాడు. లూజ్ బాల్స్‌ను మాత్రమే బౌండరీకి తరలిస్తాడు. ఇన్నింగ్స్ చివర్లో తన స్ట్రైక్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటాడు. కోహ్లీకి ఓపెనింగ్ సెట్ అవ్వదు. అతను సహజ ఓపెనర్ కాదు. అందుకే అతను విఫలమవుతున్నాడు. రిషభ్ పంత్‌తో ఓపెనింగ్ చేయిస్తే టీమిండియాకు ఈ సమస్య తీరుతోంది.'అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, June 28, 2024, 16:21 [IST]
Other articles published on Jun 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+