Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్‌లో వేగం పెంచుకోవడానికి డ్రగ్స్‌ తీసుకోమన్నారు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar says I was Provoked to Use Drugs But Always Refused it
Shoaib Akhtar - Bowling లో వేగం పెంచుకోవడానికి మత్తు పదార్థాలు వాడమన్నారు!

కరాచీ: బౌలింగ్‌లో వేగం పెంచుకోవడానికి కొంతమంది తనను డ్రగ్స్‌ తీసుకోమని సూచించినా.. వాటిని తిరస్కరించానని పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. పాకిస్థాన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే తనను డ్రగ్స్‌ వాడమని సూచించిన వ్యక్తుల పేర్లను మాత్రం ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వెల్లడించలేదు. ఎంతో ప్రతిభ ఉన్న కొందరు యువ క్రికెటర్లు తప్పుదోవ పట్టి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.

'నా కెరీర్ ప్రారంభంలో బౌలింగ్‌లో వేగం పెంచుకోవాలన్నా, కనీసం గంటకు 100 కి.మీ వేగంతో బంతులు సంధించాలన్నా డ్రగ్స్ తీసుకోవాలన్నారు. అయితే వాటిని నేను తిరస్కరించా'అని అక్తర్ తెలిపాడు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సమావేశానికి అతిథిగా వచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నా. పాకిస్థాన్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చడానికి సంబంధిత శాఖ గొప్పగా పనిచేస్తుంది. మంచి భవిష్యత్తు కోసం ఆటలు ఆడండి, శారీరక వ్యాయామాలు చేయండి' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

నిలకడగా 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే అక్తర్‌ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2002లో న్యూజిలాండ్‌పై 161 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అక్తర్.. 2010లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తం 444 వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, November 25, 2020, 13:25 [IST]
Other articles published on Nov 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+