Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలనుకున్నా: షోయబ్ అక్తర్

Shoaib Akhtar says ‘I intentionally wanted to hit Sachin Tendulkar and wound him’

కరాచి: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తన బౌలింగ్‌తో ఉద్దేశపూర్వకంగానే గాయపరచాలనుకున్నానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. టీమిండియా 2006లో పాకిస్థాన్‌‌లో పర్యటించినప్పుడు ఓ మ్యాచ్‌లో సచిన్‌ను ఎలాగైనా గాయపరచాలని ప్రయత్నించినట్లు షోయబ్‌ అక్తర్‌ గుర్తు చేసుకున్నాడు. స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సచిన్‌ను గాయపరిస్తే అతను త్వరగా ఔటవుతాడనే ఉద్దేశంతో ఇలా చేసానని చెప్పాడు.

సచిన్‌ను గాయపర్చాలని..

సచిన్‌ను గాయపర్చాలని..

'ఒక విషయాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నా. 2006లో భారత్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు కావాలనే సచిన్‌కు బంతి తగిలేలా వేయాలని అనుకున్నా. వికెట్లకు నేరుగా బంతి విసరాలని కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ పదే పదే చెప్పాడు. నేను మాత్రం సచిన్‌ శరీరాన్ని లక్ష్యంగా చేసుకునే బౌలింగ్‌ చేశా. ఎందుకంటే అతడికి గాయమైతే త్వరగా పెవిలియన్‌ చేరతాడనేది నా వ్యూహం. ఆ ఎత్తుగడ ఫలించినట్లే అనిపించింది. సచిన్‌ హెల్మెట్‌కు ఓ బంతి బలంగా తాకింది. కానీ టెండూల్కర్‌పై ఆ దెబ్బ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

పఠాన్ హ్యాట్రిక్..

పఠాన్ హ్యాట్రిక్..

ఆ తర్వాత కూడా అతనికి గాయం చేసేందుకు ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మరోవైపు ఆసిఫ్‌ భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. ఆ రోజు ఆసిఫ్‌ బంతులు వేసినట్లు ఎవరూ వేయలేరేమో అనేంతగా అతను బౌలింగ్‌ చేశాడు'' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లోనే ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ సాధించాడు. సల్మాన్ బట్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసఫ్‌లను తొలి ఓవర్‌లోనే వరుస బంతుల్లో ఔట్ చేశాడు. అయినా భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

సచిన్ కళ్లు మూసుకున్నాడు..

సచిన్ కళ్లు మూసుకున్నాడు..

అయితే మరో ఇంటర్వ్యూలో అక్తర్ పేస్‌కు భయపడి సచిన్ కళ్లు మూసుకున్నాడని ఆసిఫ్ తెలిపాడు. 'మ్యాచ్ ఆరంభంలోనే ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో మేం డీలా పడ్డాం. కానీ కమ్రాన్ అక్మల్ లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత సెంచరీతో చెలరేగడంతో 240 పరుగులు చేశాం. మేం బౌలింగ్‌కు దిగగానే అక్తర్ అత్యంత వేగవంతమైన బంతులతో బౌలింగ్ చేశాడు. నేను స్క్వేర్ లెగ్‌లో అంపైర్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సచిన్ కళ్లు మూసుకోవడం గమనించా. అక్తర్ వేసిన ఒకటి రెండు వేగవంతమైన బౌన్సర్లకు సచిన్ భయపడి కళ్లు మూసుకున్నాడు. భారత ఆటగాళ్లు సహజంగా బ్యాక్ ఫుట్‌లో ఆడుతారు. కానీ మేం వారిని 240 పరుగులు కూడా చేయనివ్వకుండా అడ్డుకున్నామని'ఆసిఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, June 7, 2022, 8:16 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+