Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటిల్ గెలిచే సీన్ టీమిండియాకు లేదు.. వచ్చేవారం ఇంటికే: షోయబ్ అక్తర్

Shoaib Akhtar says I had already said Pakistan will come back this week, And India will come back next week

అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ వరుస ఓటములను తట్టుకోలేకపోతున్న ఆ జట్టు స్టార్ పేసర్ షోయబ్ అక్తర్.. భారత విజయాలను సహించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. టోర్నీలో రెండు విజయాలు సాధించిన టీమిండియాకు టైటిల్ గెలిచే సీన్ లేదని, సెమీస్‌లో ఓడి ఇంటి దారి పట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీ పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై గెలుపొందింది. ఇక మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా గండాన్ని దాటితే... బంగ్లా, జింబాబ్వేలపై మ్యాచులు గెలిస్తే సరిపోతుంది. సఫారీలతో ఓడినా టీమిండియా సెమీస్ బెర్త్‌కు వచ్చే నష్టం ఏం లేదు.

పాకిస్థాన్ టీమ్‌ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా అంతే. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్‌ను సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే... ఇలాంటి రిజల్ట్స్‌ వస్తాయి. అయితే పాకిస్థాన్ టీమ్‌, సూపర్ 12 రౌండ్ నుంచి ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించా. టీమిండియా మరో వారం ఆడుతుందంతే. వాళ్లు కూడా వచ్చేవారం ఇంటికి వచ్చేవారు. సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం పక్కా. ఎందుకంటే వాళ్లేం తోపు ఆటగాళ్లు కాదు. పాకిస్థాన్ టీమ్ ఎలాగైతే యావరేజ్‌గా ఉందో టీమిండియా కూడా అంతే. అయితే మన టీమ్, వాళ్ల కంటే చెత్తగా ఉంది అంతే. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గరా లేదు.

ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. రెండో గేమ్‌లోనే పాకిస్తాన్, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. మరీ జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు... షాహీన్ ఆఫ్రిదీ ఫిట్‌గా ఉన్నాడా? అతను ఫిట్‌గా లేకపోయినా ఆడించాలని ఆడిస్తున్నారా? మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్‌ని ఎలా వాడుకోవాలో కూడా తెలీదు. ఫకార్ జమాన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చెబెడుతున్నారు. అతని అనుభవాన్ని వాడుకోవడం లేదు.

ఫకార్ జమాన్ లాంటి బ్యాక్ ఫుట్ బ్యాటర్‌, ఆస్ట్రేలియాలో బాగా ఆడగలడు. ఇంత చెత్తగా ఆడితే జనాలకు ముఖాలు ఎలా చూపించగలం. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? ఓ ప్లాన్ లేదు, ఓ మిడిల్ ఆర్డర్ లేదు... సరైన ఓపెనర్లు లేరు.'అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Friday, October 28, 2022, 21:16 [IST]
Other articles published on Oct 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+