For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shoaib Akhtar: ఐపీఎల్ 2022 మెగా వేలంలో బాబర్ ఆజామ్ రూ.20 కోట్లు పలికేవాడు

Shoaib Akhtar says Babar Azam will go for Rs 15-20cr in IPL auction

ఇస్లామాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడేందుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు గనుక అవకాశం లభించి ఉంటే అతను మెగా వేలంలో రూ.15 నుంచి రూ.20 కోట్లు పలికేవాడని ఆ జట్టు మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బాబర్ ఆజామ్ ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉందని తన మనసులోని కోరికను వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీతో ఓపెనింగ్ చేస్తే..

కోహ్లీతో ఓపెనింగ్ చేస్తే..

'ఐపీఎల్‌లో బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తే చూడముచ్చటగా ఉంటుంది. అదో అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఐపీఎల్ ఆడేందుకు బాబర్‌కు అవకాశం లభిస్తే మెగా వేలంలో అతను రూ. 15-20 కోట్లు పలుకుతాడు. అత్యధిక ధర పలికిన పాకిస్థాన్ ప్లేయర్‌గా గుర్తింపొందుతాడు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ అరేంగ్ర సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనగా.. ఆ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో వారిని క్యాష్ రిచ్ లీగ్ ఆడేందుకు అనుమతించడం లేదు.

అరంగేట్ర సీజన్‌లో షోయబ్ అక్తర్‌తో పాటు..

అరంగేట్ర సీజన్‌లో షోయబ్ అక్తర్‌తో పాటు..

అరంగేట్ర సీజన్‌లో షోయబ్ అక్తర్‌తో పాటు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సోహైల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, మహమ్మద్ ఆసీఫ్ పాల్గొన్నారు. షోయబ్ అక్తర్ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించగా.. అఫ్రిది డెక్కన్ చార్జెర్స్‌కు ఆడాడు. అతనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పాకిస్థాన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్రిస్ మోరీస్ రికార్డుకెక్కాడు.

రూ.16.25 కోట్లు హయ్యెస్ట్..

రూ.16.25 కోట్లు హయ్యెస్ట్..

ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్.. క్రిస్ మోరీస్ కోసం రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు వేలంలో ఇదే హయ్యెస్ట్ ప్రైజ్. అంతకుముందు యువరాజ్ సింగ్‌ను 2015 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక సాలరీల పరంగా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రూ.17 కోట్లతో టాప్ లిస్ట్‌లో ఉన్నారు. గత సీజన్ వరకు కోహ్లీ రూ. 17 కోట్లు ఆర్జించగా.. తాజా సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 17 కోట్లకు కేఎల్ రాహుల్‌ను ఎంచుకుంది.

అతను ఎప్పుడూ ఫిట్‌గా ఉండడు..

అతను ఎప్పుడూ ఫిట్‌గా ఉండడు..

కేకేఆర్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడే సమయంలో అప్పటి కోచ్ జాన్ బుచానన్ తన ఫిట్‌నెస్‌పై సందేహం వ్యక్తం చేశాడని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. అయితే సౌరవ్ గంగూలీ అతన్ని కన్విన్స్ చేశాడని చెప్పుకొచ్చాడు. 'కేకేఆర్‌తో కలిసే సమయానికి నేను నిషేధం ఎదుర్కొంటున్నా. పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. కోచ్ జాన్ బుచానన్ నా ఫిట్‌నెస్‌పై కెప్టెన్ గంగూలీతో సందేహం వ్యక్తం చేశాడు. దానికి దాదా.. అతను ఎప్పుడూ అలానే కనిపిస్తాడని, దిగులు చెండాల్సిన పనిలేదు. అతను ఫిట్‌గా లేకపోయినా జరిగే నష్టం లేదన్నాడు.

Story first published: Wednesday, March 30, 2022, 16:52 [IST]
Other articles published on Mar 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+