Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలే బక్కపల్చగా ఉన్నా.. బౌన్సర్లతో కొట్టిచంపకు అని వేడుకుని! బౌండరీలు బాదేవాడు: అక్తర్‌

Shoaib Akhtar said Muttiah Muralitharan is the toughest batsman I have bowled

కరాచీ: షోయబ్‌ అక్తర్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకడు. గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పేసర్. రాకెట్ వేగంతో బంతులు సంధించి ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. తన పదునైన బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించేవాడు.

బంతి వేసే ముందు అక్తర్ రనప్ తీసుకుంటున్నాడంటేనే.. మేటి బ్యాట్స్‌మన్‌ కూడా కాస్త భయపడేవారు. అంతటి భీకరమైన బౌలర్‌ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్‌ ఉన్నాడు. అది కూడా ఓ స్పిన్నర్. అతడు మరెవరో కాదు శ్రీలంక లెజెండరీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌.

గంటకి 161.3కిమీ వేగం

గంటకి 161.3కిమీ వేగం

స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తన కెరీర్‌లో ఎక్కువగా పదకొండో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. అప్పుడపుడు పరుగులు చేసినా.. చాలాసార్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాడు. అలాంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కోవడం షోయబ్‌ అక్తర్‌కు అసలు లెక్కే కాదు. కానీ అతడే తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టాడని తాజాగా అక్తర్‌ చెప్పాడు.

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్‌ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

బౌన్సర్లతో కొట్టిచంపకు

బౌన్సర్లతో కొట్టిచంపకు

'నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యౌట్స్‌మెన్‌ ముత్తయ్య మురళీధరన్‌. ఇది జోక్‌ కాదు. నిజమే చెబుతున్నా. 'నేను బక్కపల్చని వాడిని. నీ బౌన్సర్లతో నన్ను కొట్టిచంపకు. ప్లీజ్‌.. నువ్వు బంతి నెమ్మదిగా విసిరితే.. నేను వికెట్‌ సమర్పించుకుంటా' అని నా వద్దకు వచ్చి బ్రతిమాలాడాడు. సరేలే అని నెమ్మదిగా బౌలింగ్ చేస్తే.. భారీ షాట్‌ ఆడేవాడు. బౌండరీలు కూడా బాదేవాడు. ఇదేంటని అడిగితే.. 'ఏదో పొరపాటులో అలా ఆడాను' అని చెప్పేవాడు.

అప్పుడు ఏం అనాలో అర్ధం కాకపోయేది' అని షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. ప్రస్తుత క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజం, బెన్‌ స్టోక్స్‌ వికెట్‌ తీసే అవకాశం వస్తే బాగుంటుందని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇక పీఎస్‌ఎల్‌ లేదా ఐపీఎల్‌.. ఏ లీగ్‌లో ఆడటానికి ఇష్టపడతారని అడగ్గా.. 'మాతృ దేశం మీద ప్రేమతో పాకిస్తాన్‌ లీగ్‌, డబ్బు కోసమైతే ఐపీఎల్' ఆడతానని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Euro cup: ఫుట్‌బాలర్లపై జాతి వివక్ష, దూషణ.. 49 మందిని అరెస్ట్ చేసిన లండన్ పోలీసులు!!

ధోనీ, కోహ్లీ కన్నా దాదానే అత్యుత్తమం

ధోనీ, కోహ్లీ కన్నా దాదానే అత్యుత్తమం

కోల్‌కతాలో సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసింది ఇష్టమా లేక తన ఫాస్టెస్ట్‌ డెలివరీ (161 కిమీ వేగం 2003 ప్రపంచకప్‌లో) ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు సచిన్ వికెట్‌కే ప్రాధాన్యమిస్తా అని షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. భారత జట్టు ఉత్తమ సారథుల్లో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమం అని అడిగితే దాదా పేరునే ఎంచుకున్నాడు. తాజాగా అక్తర్ ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించిన సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో భాగంగానే మాజీ సారథి గంగూలీనే టీమిండియాకు అత్యుత్తమ కెప్టెన్‌ అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, July 13, 2021, 15:28 [IST]
Other articles published on Jul 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+