సన్నీభాయ్.. అనుకుంటే భారత్-పాక్ సిరీస్ జరుగుతోంది: అక్తర్

న్యూఢిల్లీ: కరోనా విరాళల కోసం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనపై జరుగుతున్న చర్చ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. ఈ సిరీస్ ద్వారా వచ్చిన డబ్బును ఇరు దేశాలు సమానంగా పంచుకుంటే బాగుంటుందని అక్తర్ సూచిస్తే.. తమకు ఆ డబ్బు అవసరం లేదని, విరాళల కోసం ఆటగాళ్ల ప్రాణాలను పనంగా పెట్టాల్సిన కర్మ పట్టలేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక అక్తర్ మాటల్లో తప్పేముందని, కపిల్ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది బదులిచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ అంశంపై స్పందించిన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్.. సమీప భవిష్యత్తులో భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ జరగడం కన్నా లాహోర్‌లో మంచు వర్షం కురిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ సిరీస్ అసంభవమని పేర్కొన్నాడు.
తాజాగా సన్నీ వ్యాఖ్యలపై అక్తర్ స్పందించాడు. గతేడాది లాహోర్‌లో బీభత్సంగా మంచు కురిసిందని, అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని ట్విటర్ వేదికగా కౌంటరిచ్చాడు. గావస్కర్, మంచు కురిసిన ఫొటోలను షేర్ చేస్తూ.. 'సన్నీ భాయ్.. గతేడాది లాహోర్‌లో బీభత్సంగా మంచు కురిసింది. అనుకుంటే సాధ్యం కానది ఏదీ లేదు' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర నష్టాల్లో ఉందని తెలిపిన ఛైర్మన్ ఎహ్‌సాన్ మణి.. తమ మనుగడకు భారత్ సాయం అవసరం లేదన్నాడు. తమ ఆలోచనల్లో కానీ, ప్రణాళికల్లో కానీ భారత్ లేదని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications