Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కపిల్ భాయ్.. ప్రపంచం మొత్తానికి డబ్బుల అవసరం ఉంది: అక్తర్

Shoaib Akhtar responds to remarks from Kapil Dev on Indo-Pak series for Coronavirus relief efforts

న్యూఢిల్లీ: కరోనా విరాళల సేకరణ కోసం భారత్-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. డబ్బుల కోసం క్రికెట్ ఆడాల్సిన కర్మ భార‌త్‌కు పట్టలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. అక్తర్ వ్యాఖ్యలు చాలా కామెడీగా ఉన్నాయని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కొట్టి పారేశాడు. అయితే తాజాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలపై అక్తర్ స్పందించాడు.

నా ప్రతిపాదన సరిగ్గా అర్థం చేసుకోలేదు..

నా ప్రతిపాదన సరిగ్గా అర్థం చేసుకోలేదు..

ఆజతక్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ.. తన ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశాన్ని కపిల్ దేవ్ అర్థం చేసుకోలేదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి డబ్బులు అవసరమున్నాయన్నాడు. అతి త్వరలోనే తన ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘కపిల్ భాయ్ పై నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ప్రతిపాదనను ఆయన సరిగా అర్థం చేసుకోలేదనుకుంటున్నా. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో పడనుంది. ఆర్థికంగా తీవ్ర నష్టపోనుంది. మనందరం కలిసి ఒక చోట చేరి ఆదాయాన్ని సమకూ​ర్చే సమయమిది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను కట్టిపడేస్తుంది. డబ్బవసరం లేదని కపిల్‌ పేర్కొన్నాడు. కానీ ప్రతీ ఒక్కరికి డబ్బ వసరం ఉంది. నా ప్రతిపాదన అతి త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని బలంగా నమ్ముతున్నా.'అని అక్తర్ తెలిపాడు.

ఇమ్రాన్ కన్నా.. భారత్ గురించే ఎక్కువ తెలుసు..

ఇమ్రాన్ కన్నా.. భారత్ గురించే ఎక్కువ తెలుసు..

తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే భారతీయుల జీవన స్థితుల గురించే తనకు ఎక్కువగా తెలుసని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. ‘మా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కంటే భారతీయుల గురించే నాకు ఎక్కువ తెలుసు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో పర్యటించా. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఉత్తరాఖండ్‌ ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగా. అక్కడి ప్రజలతో మాట్లాడాను. అదేవిధంగా భారతీయుల గురించి ఇక్కడ తరుచూ చెబుతుంటాను. మన దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను చూడలేను. ఓ ముస్లింగా, ఓ మనిషిగా నా వంతు సహాయం చేయడానికి ఆరాటపడతా. పాక్ తర్వాత భారత్‌లోనే నాకు అంతగా ప్రేమా అభిమానులు లభిస్తాయి. భారత ప్రజలు నా పట్ల చూపించిన అభిమానాన్ని ఏప్పటికీ మరచిపోలేను.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరించిన అక్తర్.. భారత్‌లోని వివిధ ప్రదేశాల్లో పర్యటించాడు.

మరో 6 నెలలు ఇలా ఉంటే ఏం చేస్తారు?

మరో 6 నెలలు ఇలా ఉంటే ఏం చేస్తారు?

మరో ఆరు నెలలు కూడా పరిస్థితి ఇలా ఉంటే ఏం చేస్తారని అక్తర్ ప్రశ్నించాడు. ‘వచ్చే ఆరునెలలు కూడా ఇలానే కొనసాగితే సరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా. కరోనా ఇతరాత్ర సేవల కోసం సేకరించే విరాళాల్లో పాక్‌ తర్వాత భారత్‌ నుంచే ఎక్కువగా వస్తాయి' అని అక్తర్‌ పేర్కొన్నాడు. క్రికెట్‌తో ఉపాది పొందుతున్న వారంతా ఏం చేస్తారు? కాబట్టి మనకున్న్ ఏకైక ఆప్షన్ ఫండ్ రైజింగ్ మ్యాచ్‌లు నిర్వహించడం. అలాగే ఈ సిరీస్ వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. నేను విశాలధృక్పథంలో ఆలోచించి మాట్లాడుతున్నా.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

మాకు ఆ కర్మ పట్టలేదు..

మాకు ఆ కర్మ పట్టలేదు..

ఇలాంటి సిరీస్‌ల ద్వారా వచ్చే డబ్బు భారత్‌కు అవసరం లేదని అక్తర్‌కు వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల జీవితాలతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. తమ దగ్గర చాలినంత డబ్బు ఉందని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మా అధికారులందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారని తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ రూ.51 కోట్లు విరాళంగా ఇచ్చిందని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందన్నాడు.

Story first published: Sunday, April 12, 2020, 11:32 [IST]
Other articles published on Apr 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+