సుశాంత్ కూడా దీపిక పదుకొనే లాగ చేసుంటే బాగుండు: అక్తర్

కరాచీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే డిప్రెషన్‌లో ఉన్నప్పుడు.. ఆ విషయాన్ని అందరికి చెప్పి బయట పడిందని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కూడా అలా చేసుంటే బాగుండు అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఒకానొక సమయంలో తాను సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయానని, మాట్లాడి ఉంటే అనేక సమస్యలపై అతనితో చర్చించే వాడినన్నాడు. ఆ రోజు మాట్లాడనుందుకు ఈ రోజు చాలా బాధపడుతున్నానని షోయబ్ పేర్కొన్నాడు.

సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయా
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం గురించి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన తాజా వీడియోలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'సుశాంత్ మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఆ వార్త విన్నాక నన్ను ఓ విషయం చాలా బాధపడేలా చేసింది. 2016 లో సుశాంత్‌ని ఒకసారి ముంబైలో కలిశా. పొడుగాటి జుట్టుతో ఉన్నాడు. ఆ సమయంలో సుశాంత్.. 'ఎంఎస్ ధోనీ' సినిమాలో నటిస్తున్నాడని కొందరు నాతో చెప్పారు. అప్పుడు నేను సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయా. అయితే అతని నటనను మాత్రం చూడాలనుకున్నా. సినిమాలో అతడు బాగా చేశాడు' అని అన్నాడు.

సమస్యలపై అతనితో చర్చించే వాడిని
'నేను అప్పుడు సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయా. కానీ ఇప్పుడు అతడు లేడు. ఆరోజు సుశాంత్‌తో మాట్లాడిఉంటే అనేక సమస్యలపై అతనితో చర్చించే వాడిని. నా జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా అతనితో పంచుకునేవాడిని. దీంతో సమస్యలని ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం అతనికి వచ్చేది. ఆ రోజు సుశాంత్‌తో మాట్లాడనుందుకు ఈ రోజు చాలా బాధపడుతున్నా' అని అక్తర్ తెలిపాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు.

దీపిక లాగ చేసుంటే బాగుండు:
'సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారితో పంచుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. హీరోయిన్ దీపిక పదుకొనే కూడా డిప్రెషన్ కారణంగా బాధపడేది. కానీ ఆమె ఆ విషయాన్ని అందరికి చెప్పి బయటపడింది. సుశాంత్ కూడా అలానే చేసి ఉండిఉండే.. ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదోమో' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ విచారం వ్యక్తం చేశాడు. గతనెల 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'ధోనీ నమ్మశక్యంకాని ఆటగాడు.. మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు'