For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ నమ్మశక్యంకాని ఆటగాడు.. మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు'

Michael Hussey says Hope MS Dhoni keeps playing for another 10 years

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ మరో పదేళ్లు ఆడితే చూడాలనుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్‌ హస్సీ అన్నాడు. వీలైనంత సుదీర్ఘ కాలం మహీ క్రికెట్‌ ఆడాలని కోరుకున్నాడు. మైదానంలో ధోనీ తీసుకొనే నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయని, మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొనే ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు అని హస్సీ అన్నాడు. మైదానంలో మహీ కదలికలు అద్భుతంగా ఉంటాయని ప్రశంసించాడు.

మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు

మరో 10ఏళ్లు క్రికెట్ ఆడతాడు

సోనీ టెన్స్ పిట్ స్టాప్‌ చాట్ షోలో మైకేల్‌ హస్సీ మాట్లాడుతూ... ఎంఎస్ ధోని 'అద్భుతమైన వ్యక్తి. భారత్‌, చెన్నై సూపర్ ‌కింగ్స్‌కు సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు. అతడు మరో పదేళ్లు ఆడాలని మేం కోరుకుంటున్నాం. అది సాధ్యమవుతుందో లేదో తెలియదు కానీ వీలైనంత సుదీర్ఘ కాలం ఆడాలని ఆశిస్తున్నా' అని అన్నాడు. హస్సీ ఆసీస్ తరఫున 79 టెస్టులు, 185 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 6235, వన్డేల్లో 5442, టీ20ల్లో 721 రన్స్ చేశాడు.

ఆ ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు

ఆ ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు

'కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనీ అంటే నాకెంతో ఇష్టం. అతడు ఆటగాళ్లను ప్రోత్సహించే విధానం, వారిపై ఎంతో విశ్వాసం ప్రదర్శించడం, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం ఎంతగానో నచ్చుతాయి. అతడు తీసుకొనే నిర్ణయాలు ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొనే ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు. మైదానంలో మహీ కదలికలు, తీసుకొనే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి' అని మైకేల్‌ హస్సీ ప్రశంసించాడు.

ఐపీఎల్‌తో ప్రేమలో పడ్డా

ఐపీఎల్‌తో ప్రేమలో పడ్డా

'2008లో సీఎస్కే డ్రస్సింగ్‌ రూమ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే నేను ఐపీఎల్‌తో ప్రేమలో పడ్డాను. అక్కడ అద్భుతమైన వాతావరణం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రేమించేవారు అక్కడుంటారు. వారు ఆటకు సన్నద్ధమయ్యే తీరు పరిశీలించొచ్చు. మనకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. భారత ఆటగాళ్లను అడిగి స్పిన్‌ను ఎదుర్కోవడం ఎలానో నేర్చుకోవచ్చు. ఇక ధోనీతో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం ఎంతో బాగుంటుంది. ఒత్తిడిలోనూ అతడి ప్రశాంతత చాలా బాగుంటుంది. కానీ నేను అంత ప్రశాంతంగా మాత్రం ఉండలేను' అని హస్సీ పేర్కొన్నాడు.

కోహ్లీని అభినందించాల్సిందే

కోహ్లీని అభినందించాల్సిందే

టీమిండియాలో ఇప్పటికీ ధోనీని ఉంచుకున్నందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అభినందించాలని మైకేల్‌ హస్సీ అన్నాడు. ఆ స్థాయి వ్యక్తి జట్టులో ఉండటం ఎంతో అవసరమన్నాడు. 'కోహ్లీని అభినందించాల్సిందే. మహీ భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌. అలాంటి వ్యక్తి జట్టులో ఉండటం ప్రమాదకరమని కొందరు భావిస్తుంటారు. అయితే ధోనీతో ఇబ్బందేమీ లేదని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. మహీ నుంచి నేర్చుకొనేందుకు ప్రయత్నిస్తాడు. అత్యుత్తమ జట్టును తయారు చేసేందుకు మహీ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తాడు' అని హస్సీ చెప్పుకొచ్చాడు.

ఫిక్సింగ్ ఆరోపణలు.. 6 గంటలపాటు డిసిల్వా ఇంటరాగేషన్!!

Story first published: Wednesday, July 1, 2020, 15:43 [IST]
Other articles published on Jul 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+