ఆసియా కప్ 2025 టోర్నీలో తొలి పోరుకు టీమిండియా సన్నదమైంది. మరికొద్ది క్షణాల్లో యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. టైటిల్ ఫేవరేట్‌గా.. టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతుంది. యూఏఈపై గెలవడం టీమిండియాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ గెలుపుపై ఎవరికీ సందేహాలు కూడా లేవు. తర్వాతి పోరులో తలపడాల్సింది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కావడంతో ఈ మ్యాచ్‌ను భారత్ సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇటీవల బంగ్లాదేశ్‌తో యూఏఈ సిరీస్ గెలిచింది. భారత జట్టుకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో భారత్ సునాయసంగా గెలుస్తుందని చెప్పాడు. అయితే యూఏఈ గట్టి పోటీనివ్వాలని, తక్కవ మార్జిన్‌తో ఓడినా ఆ జట్టు విజయం సాధించినట్లేనని తెలిపాడు. భారత జట్టు నిండా ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారని, ఎవరిని బెంచ్‌పై కూర్చోబెడుతారో? అని ప్రశ్నించాడు.

'అభిషేక్ శర్మ, బుమ్రా, సంజూ శాంసన్ జట్టులో ఉన్నారు. తిలక్ వర్మకు కూడా అవకాశం దక్కింది. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ , శివమ్ దూబే, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. మరి టీమిండియా మేనేజ్‌మెంట్ ఎవర్ని బయట కూర్చోబెడుతుందో..?
ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని, యూఏఈ ఓడుతుందని అందరికి తెలుసు. అయితే తక్కువ మార్జిన్‌తో ఓడిపోతే యూఏఈ గెలిచినట్లే భావించాలి. అఫ్గానిస్థాన్‌తో 94 పరుగుల తేడాతో ఓడిపోయిన హాంగ్ కాంగ్‌పై నాకు ఇదే కోపం. ఓడిపోవాల్సిందే.. కానీ కనీస పోటీ ఇస్తేనే కదా గుర్తింపు లభించేది. కాస్త పోరాట చూపించాలి.'అని అక్షర్ పేర్కొన్నాడు.
మరోవైపు ఈ టోర్నీ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని సూర్యుకుమార్ యాదవ్ తెలిపాడు. తమకు తాము ఫేవరేట్‌గా భావిస్తలేమని, టీ20ల్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో దూకుడుగానే ఉంటామని, ఈ విషయంలో ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు చేయలేదన్నాడు. దూకుడుగా లేకుంటే క్రీడల్లో కొనసాగలేమని చెప్పాడు. యూఏఈతో పోరు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.