For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్ ఆజామ్ ఓ ఫ్రాడ్.. అతని వల్లే పాకిస్థాన్‌కు ఓటమి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్‌కు అతను ఏ మాత్రం రోల్ మోడల్ కాదని, ఓ ఫ్రాడ్ అని మండిపడ్డాడు. బాబర్ ఆజామ్ స్లో బ్యాటింగ్ కారణంగానే పాకిస్థాన్ ఓటమిపాలైందని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో బాబర్ ఆజామ్‌ను పోల్చడం ఆపేయాలని అభిమానులకు సూచించాడు. విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ అయితే బాబర్ ఆజామ్ టుక్ టుక్ బ్యాటింగ్‌‌కు హీరోనని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గురించి మాట్లాడాలని కూడా లేదని, డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుతున్నానని తెలిపాడు.

Shoaib Akhtar lashes out at Babar Azam and called him a fraud after IND beat PAK in CT2025

'మేం తరుచూ బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోలుస్తాం. ఇప్పుడు కోహ్లీ హీరో ఎవరో చెప్పండి. సచిన్ టెండూల్కర్ 100 శతకాలు సాధిస్తే విరాట్ కోహ్లీ అతని ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. బాబర్ ఆజమ్ హీరో ఎవరు? టుక్ టుక్. బాబర్ ఆజామ్ తప్పుడు హీరోలను ఎంచుకున్నాడు. అతని ఆలోచన విధానం తప్పు. బాబర్ ఆజామ్ మొదటి నుంచి మోసగాడే. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గురించి మాట్లాడేందుకు కూడా నాకు ఇష్టం లేదు. కానీ డబ్బులు ఇస్తున్నారనే కారణంతోనే మాట్లాడుతున్నాను.'అని అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు.

మరోవైపు అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీపై అక్షర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఓ సూపర్ హీరో అంటూ కొనియాడాడు. 'విరాట్ కోహ్లీ ఇలా రాణించడం గతంలో కూడా చూశాం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఉందని కోహ్లీకి చెబితే.. అతను సెంచరీ చేస్తాడు. అతనికి హ్యాట్సాఫ్. కోహ్లీ ఓ సూపర్ స్టార్. వైట్ బాల్ రన్ ఛేజర్. ఈ తరం అత్యుత్తమ బ్యాటర్. ఈ విషయంలో అతనిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అతని ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రశంసలకు అతను పూర్తి అర్హుడు.'అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు రెడీ అయ్యింది.

Story first published: Monday, February 24, 2025, 16:51 [IST]
Other articles published on Feb 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+