పాకిస్తాన్ జట్టుది బుర్రలేని బ్యాటింగ్.. ఆ మాత్రం ఇంగితం లేకపోయింది: అక్తర్ ఫైర్

కరాచీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆదివారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్ 9 వికెట్ల తేడాతో పాక్‌పై సునాయాసంగా గెలిచింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌అర్ధ శతకాలతో రెచ్చిపోవడంతో 164 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లోనూ పాక్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది.

హఫీజ్ ఒక్కడే:
న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు కొందరు పూర్తిగా విఫలమయ్యారు. రెండో టీ20లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్ (99 నాటౌట్: 57 బంతుల్లో 10x4, 5x6) తృటిలో సెంచరీ కోల్పోయాడు. హఫీజ్ అద్భుతంగా ఆడినా.. ఎవరూ అతనికి సహకారం అందించలేకపోయారు. ఒకరిద్దరు రాణించి ఉంటే పాక్ భారీ స్కోర్ చేసేదే. కానీ ఒక్కరు కూడా సరిగా ఆడలేదు. కౌశదిల్ సాహా 20 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేయగా.. రిజ్వాన్ 20 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఇద్దరూ నెమ్మదిగా ఆడి.. చివరకు నిర్లక్ష్యంగా షాట్ ఆడి పెవిలియన్ చేరారు.

బుర్రలేని బ్యాటింగ్
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌ల ఆట తీరుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాక్ ఆటగాళ్లు ఏమాత్రం బుర్రలు వాడటంలేదని మండిపడ్డాడు. 'పిచ్ స్పందిస్తున్న తీరు, బౌలర్లు టార్గెట్ చేస్తున్న బంతుల్ని పాక్ బ్యాట్స్‌మెన్‌లు ఏమాత్రం పరిశీలించలేదు. పాక్ జట్టుది బుర్రలేని బ్యాటింగ్. అటాకింగ్ క్రికెట్ ఆడమని కొంత మంది చెప్పోచ్చు. అలాఅని ప్రతి బంతినీ నిర్లక్ష్యంగా షాట్ ఆడడమేనా?. హైదర్ అలీ ఒక బంతిని సిక్స్‌గా కొట్టి.. తర్వాత బంతిని కూడా అదే తరహాలో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని గ్యాప్‌లో హిట్ చేయాలనే ఇంగితం అతనికి లేకపోయింది. అబ్ధులా అయితే మరీ దారుణం. అతను తల కిందకి వంచి ఫుల్ షాట్ ఆడాడు. ఇప్పటికైనా తేరుకోండి' అని అక్తర్ ఫైర్ అయ్యాడు.

సీఫెర్ట్ హాఫ్ సెంచరీ
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మార్టిన్ గప్టిల్ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. టీమ్ సీఫెర్ట్ (84 నాటౌట్: 63 బంతుల్లో 8x4, 3x6), కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ జోడీని విడదీయడం పాక్ బౌలర్లు వల్లకాలేదు. అష్రఫ్‌కు ఒక వికెట్ దక్కింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' టిమ్ సౌతీకి దక్కింది.
NZ need 64 from 53 balls with nine wickets in hand.
LIVE COMMENTARY:
👉 https://t.co/omeN2wkNrJ 👈#NZvPAK #PAKvNZ pic.twitter.com/JUl8GpRO1U — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 20, 2020 '>
సెడెన్ పార్క్‌లో ఓ అద్భుతం
అభిమానులంతా ఆసక్తికరంగా మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆకాశంలో గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఈ సుందరమైన దృశ్యం సెడెన్ పార్క్‌లో చోటు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 10వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కెమెరామన్ దీన్ని బంధించాడు. అభిమానులు అందరూ ఈ రమణీయమైన దృశ్యంను ఆసక్తికరంగా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
విమర్శలకు నేరుగా స్పందించని పృథ్వీ షా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నాడంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications