For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ ఆ మాట అనుంటే అక్కడే పాతరేసేవాణ్ణి.. మహిళా జర్నలిస్ట్‌పై అక్తర్ ఫైర్!

 Shoaib Akhtar fumes at journalist over Baap baap hota hai query
Sehwag అలా అంటుంటే స్పాట్ లో చంపేసేవాడిని | Shoaib Akhtar | Ind Vs Pak | Telugu Oneindia

న్యూఢిల్లీ: పాకిస్థాన్ దిగ్గజ పేసర్, రావల్సిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఓ జర్నలిస్ట్‌పై కస్సుమన్నాడు. అనవసర ప్రశ్నలతో విసిగించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్‌ డిబేట్ వెళ్లిన అక్తర్.. జర్నలిస్ట్ అడిన ప్రశ్నకు సహనం కోల్పోయాడు.

వీరేంద్ర సెహ్వాగ్ మిమ్నల్ని 'బాప్ బాప్ హోతా హై' అన్నాడన్న కామెంట్స్ గురించి తమకు తెలుసని, గతంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇంకా అలాంటి ఘటనలేమైనా జరిగాయో చెబుతారా..? అని ఆ డిబేట్ హోస్ట్‌గా ఉన్న లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు చిర్రెత్తుకుపోయిన అక్తర్ ఆమెపై నోరు పారేసుకున్నాడు.

అక్కడే చంపేసేవాడిని..

సెహ్వాగ్ ఆ మాట నా ముందు అనుంటే అతన్ని అక్కడే పాతరేసేవాణ్ణని ఊగిపోయాడు. 'మొదట నేను మీ అందరికి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెహ్వాగ్ అలాంటి కామెంట్ నా ముందు చేయలేదు. నిజంగానే అలా చేసుంటే అతన్ని అక్కడే చంపేసేవాడిని. సెహ్వాగ్ ఈ కామెంట్ ఎప్పుడు, ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఇదే విషయమై నేను ఒకసారి బంగ్లాదేశ్‌లో సెహ్వాగ్‌ను కూడా అడిగాను. కానీ అతను మాత్రం తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బదులిచ్చాడు.

ఇరు దేశాల మధ్య ద్వేషం పెంచొద్దు..

ఇరు దేశాల మధ్య ద్వేషం పెంచొద్దు..

మరో విషయమేమిటంటే.. మనం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిద్దాం. ఇలాంటి పనికిమాలిన ప్రశ్నల వల్ల వచ్చేదేమీ లేదు. భారత్ అంటే నాకు చాలా గౌరవముంది. మిమ్నల్ని (జర్నలిస్టును ఉద్దేశిస్తూ) కూడా నేను గౌరవిస్తున్నాను. ఇలాంటి కామెంట్స్ వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ప్రశాంతత పాడవుతోంది. అలాంటి పని నేను చేయలేను.'అని ఘాటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలు విషయం ఏంటంటే..?

అసలు విషయం ఏంటంటే..?

ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఓ కార్యక్రమంలో అక్తర్‌తో మైదానంలో చోటు చేసుకున్న ఓ స్లెడ్జింగ్ ఘటనను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఘటనను వివరిస్తూ.. సచిన్‌తో పాటు క్రీజులో ఉన్న తాను డబుల్ సెంచరీకి సమీపిస్తుండగా.. అక్తర్ బౌన్సర్లు సంధిస్తూ తనను పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, హుక్ షాట్ ఆడాలని సవాల్ విసిరాడని తెలిపాడు.

దీంతో సహనం కోల్పోయిన తాను నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ను చూపిస్తూ..' 'వోహ్ తేరా బాప్ ఖాడా హై వో నాన్-స్ట్రైకింగ్ ఎండ్ పె, ఉస్ కో బోల్ వో మార్ కే డిఖాయేగా.'(నాన్‌ స్ట్రైకింగ్‌లో నీ అయ్య ఉన్నాడు.. ఆయనను అడుగు హుక్ షాట్ ఆడమని)అని చెప్పా. ఆ మరుసటి ఓవర్‌లోనే షోయబ్ వేసిన బౌన్సర్‌ను మాస్టర్ సిక్స్‌గా మలిచాడు. నేను వెంటనే అక్తర్‌తో 'బెటా బెటా హోతా హై, బాప్ బాప్ హోతా హై'(కొడుకు ఎప్పుడు తండ్రిపై ఆధిపత్యం ప్రదర్శించలేడు)'అని చెప్పా'అని భారత్, పాక్ క్రికెటర్లు పాల్గొన్న ఆ షోలో షారుఖ్‌తో సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Tuesday, August 30, 2022, 21:42 [IST]
Other articles published on Aug 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+