
ప్రపంచకప్ తర్వాతే..
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాతే ధోనీ తన ఆటకు వీడ్కోలు పలకాల్సిందని, అసలు ఈ విషయాన్ని అతను ఎందుకు సాగదీస్తున్నాడో అర్థం కావడంలేదన్నాడు. ధోనీ లాంటి దిగ్గజానికి ఘన వీడ్కోలు లభించాలని ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు.
‘ధోనీ తన పూర్తిసామర్థ్యాలను ఉపయోగించి భారత క్రికెట్‌కు సేవలు అందించాడు. గౌరవంతో అతడు క్రికెట్‌ను వీడాలి. అతడు ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకుసాగదీస్తున్నాడో అర్థం కావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతే అతడు రిటైరవ్వాల్సింది. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉంటే అప్పుడే ఆటకు వీడ్కోలు పలికేవాడిని. నా కెరీర్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ మూడు, నాలుగేళ్లు ఆడాను. కానీ 100 శాతం ఆడుతలేననే విషయం గ్రహించి 2011 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాను. మరీ అతనెందుకు కొనసాగుతున్నాడో?'అని అక్తర్ ప్రశ్నించాడు.

గ్రాండ్ ఫెర్‌వెల్ ఇవ్వాలి..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధోనీ నిశబ్దంగా ఉన్నాడనీ, కానీ ఘనమైన వీడ్కోలు అందుకునేందుకు అతను అర్హుడని అక్తర్ చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచకప్ తీసుకు రావడంతో పాటు భారత క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ధోనీకి గౌరవంతో కూడిన ఘన వీడ్కోలు ఇవ్వాలి. అతను అద్భుతమైన వ్యక్తి. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ధోనీ మౌనంగా ఉంటున్నాడు'అని అక్తర్ తెలిపాడు.
ప్రపంచకప్‌లో సెమీస్‌తోనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావించానని తెలిపిన అక్తర్.. అలా ఎందుకు చేయాలదనేది మాత్రం ధోనీనే సమాధానమివ్వాలన్నాడు. ప్రపంచకప్ తర్వాతనైనా.. వీడ్కోలు సిరీస్ ఆడి, గౌరవంగా తప్పుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీసేన ఓటమికి అదే కారణం..
ఇక మాములు సిరీస్‌ల్లో అదరగొడుతున్న కోహ్లీ సేన.. ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవకపోవడానికి మిడిలార్డర్‌లో మ్యాచ్ విన్నర్స్ లేకపోవడమే కారణమని అక్తర్ చెప్పుకొచ్చాడు. ‘టోర్నీ విజేతలుగా నిలవడం ఒక విషయమైతే.. అగ్ర జట్టుగా కొనసాగడం మరో విషయం. టెస్ట్‌ల్లో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
పరిమిత ఓవర్లలో కూడా టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఉంది. కేవలం ఐసీసీ ఈవెంట్ల ఫలితాల ఆదారంగా వారి ప్రదర్శనపై ఓ అంచనాకు రాకుడదు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్స్ కూడా వారు గెలవాల్సిందే. టాప్-4 చెలరేగితో ఆ జట్టుకు తిరుగుండదు. కానీ ఎప్పుడో ఒకసారి విఫలమైతే మాత్రం ఫలితం వేరేలా ఉంటుంది. వారి సమస్యే అదే. అలాగే ధోనీ, యువరాజ్ సింగ్ వంటి ఫినిషర్స్ మిడిలార్డర్‌లో ఉంటే.. ఫలితం వేరేలా ఉంటుంది. సమస్యంతా మిడిలార్డర్‌లో ఫినిషర్స్ కొరత వల్లే.'అని అక్తర్ విశ్లేషించాడు.

టీ20 ప్రపంచకప్ కూడా జరగదు..
ఇక ప్రస్తుత కరోనా భీబత్సం ఇలానే కొనసాగితే మరో 6-8 నెలలు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఉండవన్నాడు. ఇక భారత్, ఆస్ట్రేలియా పర్యటన కొనసాగితే మాత్రం.. కోహ్లీసేనకు విజయం అంత సులువుగా దక్కదన్నాడు. ‘నేనైతే ఈ సిరీస్ జరుగుతుందనుకోవడం లేదు. నా అంచనా ప్రకారం మరో 6-8 నెలలు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఉండవు. టీ20 వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం లేదు.'అని అక్తర్ జోస్యం చెప్పాడు. ఇక కరోనా విరాళల సేకరణ కోసం భారత్-పాక్ సిరీస్ నిర్వహించాలనే ప్రతిపాదన చేసిన అక్తర్.. భారత దిగ్గజాలు కపిల్ దేవ్, మదన్‌లాల్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












