For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: అతి చేసిన బౌలర్లు, వార్నింగ్ ఇచ్చిన మ్యాచ్ రిఫరీ

By Nageshwara Rao
Shivam Mavi, Avesh Khan reprimanded for code of conduct breaches

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లను మ్యాచ్‌ రిఫరీ మందలించాడు. ఇందులో ఒకరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన శివమ్‌ మావి కాగా, రెండో ఆటగాడు దిల్లీ డేర్‌డెవిల్స్‌కు చెందిన అవేశ్‌ ఖాన్‌.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల ఆధారంగా వీరిని రిఫరీ మందలించడం జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ కొలిన్ మున్రో(33) పరుగుల వద్ద శివమ్ మావి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో మావి తన నోటికి పనిచెప్పాడు.

ఆ తర్వాత కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్(44) పరుగుల వద్ద ఆవేన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఆవేశ్ ఖాన్ మైదానంలో కాస్త అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు మితి మీరి సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరూ మ్యాచ్ రిఫరీ ఈ ఇద్దరీ మందలించాడు. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Shivam Mavi, Avesh Khan reprimanded for code of conduct breaches

అనంతరం విచారణలో వీరిద్దరూ తమ తప్పును ఒప్పుకోవడంతో కేవలం మందలింపుతో రిఫరీ సరిపెట్టాడు. 'ఇద్దరు మావి, ఖాన్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ టీం అఫీషియల్స్ 2.1.7 ప్రకారం లెవల్ 1 తప్పు చేశాడు. తమ తప్పుని అంగీకరించారు కూడా' అని అందులో పేర్కొంది.

లెవల్ 1 తప్పుకి శిక్షని నిర్ధారించడం పూర్తిగా మ్యాచ్ రెఫరీ చేతుల్లో ఉంటుంది. నైట్‌రైడర్స్‌ బౌలర్ శివమ్ మావి ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 58 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయగా... మరోవైపు ఢిల్లీ బౌలర్ అవేశ్‌ ఖాన్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి.

Story first published: Saturday, April 28, 2018, 16:03 [IST]
Other articles published on Apr 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+