Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వల్లే ఇలా ఆడుతున్నా: శివమ్ దూబే

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే తాను మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నానని టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించడంతో తన జీవితం మలుపు తిరిగిందన్నాడు. ధోనీ భాయ్, చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్నానని తెలిపాడు.

అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే(34 బంతుల్లో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి టీ20లోనూ దూబే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన దూబే.. తన ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనీ‌తో పాటు సీఎస్‌కే జట్టుదేనన్నాడు.

 Shivam Dube says Credit goes to MS Dhoni and CSK After Scoring Back-To-Back 60s vs AFG

'ఈ క్రెడిట్ అంతా ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుదే. ధోనీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే ఐపీఎల్‌తో పాటు భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాను. ధోనీ భాయ్ ఎప్పుడూ నాతో ఒకటే చెప్పేవాడు. 'శివమ్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలవు'అని నన్ను ప్రోత్సహించాడు.

నా ప్రదర్శనపై మా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. బాగా ఆడానని మెచ్చుకున్నాడు. జైస్వాల్, నేను స్ట్రోక్ ప్లేయర్స్. మా గేమ్ ప్లాన్ ఏంటో మాకు తెలుసు. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగడం నా రోల్. కానీ మేం ఇద్దరం ధాటిగా ఆడి మ్యాచ్‌ను వీలైనంత త్వరగా ముగించాలనుకున్నాం. ఇంతకు మించి మా మదిలో ఎలాంటి లక్ష్యం కూడా లేదు. కానీ మేం ముందుగా మ్యాచ్‌ను ముగించాల్సింది.

స్కిల్‌పైనే కాకుండా ఎన్నో విషయాలను నేను మెరుగుపరుచుకున్నాను. టీ20 గేమ్‌కు మానసికంగా ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నాను. ఒత్తిడి ఎలా జయించాలి? ఏ బౌలర్‌పై ఎదురుదాడికి దిగాలి? ప్రతీ బంతిని హిట్ చేయడం ముఖ్యం కాదని తెలుసుకున్నా. అలాగే నా బౌలింగ్‌ను కూడా మెరుగుపరుచుకున్నాను.

తొలి మ్యాచ్‌లో బాగానే బౌలింగ్ చేసినా.. ఈ మ్యాచ్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాను. టీ20ల్లో ఇవన్నీ సహజమే.'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్‌తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా దూబే, యశస్వి సిక్సర్ల మోతకు ఓవర్లలో 4 వికెట్లకు పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29), రింకూ సింగ్(9 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

Story first published: Monday, January 15, 2024, 15:13 [IST]
Other articles published on Jan 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+