టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే టాక్ ఆఫ్ ది ఇండియా క్రికెట్‌గా మారాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎదిగాడు.
కాలు కదపకుండా సిక్స్‌లు బాదడం, స్పిన్నర్లను చీల్చి చెండాడటం శివమ్ దూబే స్పెషాలిటీ. ఈ క్రమంలోనే అతనికి టీమిండియా మేనేజ్‌మెంట్ స్పెషల్ రోల్ ఇచ్చింది. మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను అటాక్ చేయడమే అతని బాధ్యత. సూపర్ ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే.. ఐపీఎల్‌లో కూడా ఇలానే బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటితే టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శివమ్ దూబే సూపర్ ఫామ్ నేపథ్యంలో అతని వ్యక్తి జీవితానికి సంబంధించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాను తలపించే అతని లవ్ స్టోరీ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. హిందువు అయిన శివమ్ దూబే ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలు అంజుమ్ ఖాన్‌తో సుదీర్ఘ కాలం ప్రేమాయణం నడిపించిన శివమ్ దూబే.. 2021లో పెళ్లి చేసుకున్నాడు. మతాలు వేరు కావడంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అభ్యంతరం తెలిపాయి. దాంతో ఇరు కుటుంబాలు ఒప్పుకునే వరకు ఓపిక పట్టి ఈ జోడీ.. చివరకు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజుమ్ ఖాన్.. అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మోడల్ అయిన ఆమె అనేక హిందీ సీరియల్స్‌తో పాటు పలు ముస్లిం ఆల్బమ్స్‌లో నటించింది.
ఇక శివమ్ దూబే-అంజుమ్ ఖాన్‌లకు 2022లో ఓ బాబు పుట్టాడు. శివమ్ దూబే, అంజుమ్ ఖాన్‌లు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పడు తమ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శివమ్ దూబే.. ధోనీ సారథ్యంలో రాటు దేలాడు.