For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా విధ్వంసానికి కారణం అదే: శివమ్ దూబే

తన మైండ్‌సెట్‌తోనే తన ఆట మెరుగైందని టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. బౌలర్లు వేసే బంతులను కచ్చితంగా అంచనా వేస్తుండటంతోనే అలవోకగా భారీ షాట్లు ఆడగలుగుతున్నానని చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

ఇష్ సోధీ బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్ దూబే.. ఒకే ఓవర్‌లో 29 పరుగులు రాబట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో భారత్ ఓడినా.. శివమ్ దూబే ఊచకోత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఇంకాసేపు దూబే క్రీజులో ఉంటే భారత్ గెలిచేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శివమ్ దూబే.. కఠిన పరిస్థితుల్లో ఆడటం వల్ల బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలిగానని తెలిపాడు.

Shivam Dube Credits Strong Mindset for His Quickfire T20I Half-Century against New Zealand

'ప్రస్తుతం నేను చాలా కష్టపడుతున్నాను. నా మానసిక స్థితితోనే నా ఆట మెరుగవుతోంది. కఠిన పరిస్థితుల్లో ఆడటం అలవాటవుతోంది. దాంతో బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలుగుతున్నాను. వారు నాకు ఎలాంటి బంతులు సంధించబోతున్నారో ఊహించగలుగుతున్నాను.

స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం. ఇష్ సోధీ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను కొన్ని చెడ్డ బంతులేస్తాడని నాకు తెలుసు. వాటి కోసమే ఎదురు చూశాను. ఆ సమయంలో నేను డామినేట్ చేద్దామనుకున్నా'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.

63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌తో స్టేడియం బయటకు పంపించాడు. అతని ధాటికి బంతి 101 మీటర్ల దూరంలో పడింది. ఈ సిక్స్‌కు న్యూజిలాండ్ బౌలర్ కమ్ కెప్టెన్ అయిన మిచెల్ సాంట్నెర్ నోరెళ్ల బెట్టాడు. ఇష్ సోదీ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా 2, 4, 6,4, 6, 6 బాది 29 పరుగులు పిండుకున్నాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ చేసేలా కనిపించిన శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 65) దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో హర్షిత్ రాణా కొట్టిన షాట్‌‌కు బంతి ‌బౌలర్ చేతికి తాకి నాన్‌స్ట్రైకర్ వికెట్లను తాకింది. అప్పటికే శివమ్ దూబే క్రీజును ధాటడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అతను కాసేపు ఉండి ఉంటే మ్యాచ్ భారత్ వశమయ్యేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, January 29, 2026, 15:33 [IST]
Other articles published on Jan 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+