
ముంబై: భారత మహిళల టీమ్ హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్‌కు ఇటీవల బాధ్యతలు అప్పగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ).. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ పలు మార్పులు చేసింది. టీమిండియా మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్‌ను మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సోమవారం నియమించింది. ఇక, తృప్తి భట్టా చార్య ప్లేస్‌లో రాణ్‌కువార్‌దేవీ గైక్వాడ్‌ను టీమ్‌మేనేజర్‌గా ఎంపిక చేసింది. వీరంతా ఇంగ్లండ్ టూర్ వరకు జట్టుతో కలిసి పని చేయనున్నారు.
23 టెస్ట్‌లు, 4 వన్డేల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన దాస్.. ఢిల్లీ, రైల్వేస్ తరఫున 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2020లో భారత మహిళల-ఏ టీమ్‌తోనూ దాస్ పనిచేశాడు. గతంలో ఓ ప్లేయర్‌గా ఇంగ్లండ్ వెళ్లిన తాను ఈసారి కోచ్‌గా అక్కడికి వెళ్లనుండటం అద్భుతంగా ఉందని శివసుందర్ దాస్ పేర్కొన్నాడు.
కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రమేశ్ పొవార్.. ఫస్ట్ అసైన్‌మెంట్ జూన్ 16 నుంచి మొదలుకానుంది. మిథాలీ నేతృత్వంలోని టీమిండియా.. హీథర్ నైట్ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ పర్యటన కోసం భారత మహిళా క్రికెటర్లంతా పురుషుల క్రికెటర్లతో ఒకే ఫ్లైట్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో బుధవారం నుంచి రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్ తుషార్ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్‌తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్‌పైనే వేటు పడుతుందన్న తుషార్... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.