Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shimron Hetmyer కొంపముంచిన అలసత్వం.. ప్రపంచకప్ జట్టు నుంచి ఔట్!

Shimron Hetmyer misses flight, replaced by Shamarh Brooks in West Indies T20 WC squad

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా 16 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అలసత్వంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు. నిర్ణీత సమయంలో విమానాశ్రయం చేరడంలో విఫలమైన హెట్‌మైర్.. ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. దాంతో క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) అతని స్థానంలో షమారా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సీడబ్ల్యూఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

'షిమ్రాన్ హెట్‌మైర్ తన రీషెడ్యూల్ ఫ్లైట్‌ను కూడా మిస్సయ్యాడు. దాంతో క్రికెట్ వెస్టిండీస్ సెలెక్షన్ ప్యానల్ ప్రపంచకప్ జట్టు నుంచి అతన్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆలస్యంగా వస్తానని హెట్‌మైర్‌ బోర్డును రిక్వెస్ట్ చేయడంతో అనుమతిచ్చింది. కానీ అతను రిషెడ్యూలింగ్ ఫ్లైట్‌ను కూడా మిస్సయ్యాడు. దాంతో అతని స్థానంలో బ్రూక్స్‌ను ఎంపిక చేశాం. షమారా బ్రూక్స్ కూడా గత కొన్ని రోజులుగా వెస్టిండీస్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన సీపీఎల్‌ రెండో దశలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.'అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది. ఫ్లైట్ మిస్సైన హెట్‌మైర్ బుధవారం ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అక్టోబర్ 17న స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ ప్రపంచకప్ క్యాంపైన్ షురూ చేయనుంది.

వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు:
నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పోవెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్

Story first published: Tuesday, October 4, 2022, 7:49 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+