For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జిమ్‌లో ప్రాక్టీసు చేస్తోన్న ధావన్(వీడియో)

India vs Westindies 2018 : Shikhar Dhawan Works Out Well In Gym For Fitness | Oneindia Telugu
Shikhar Dhawan trains hard in the gym after being snubbed from Test squad for West Indies series

న్యూ ఢిల్లీ: భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ పునరాగమనం కోసం కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో శిఖర్ ధావన్ మెరుగ్గా రాణించినా.. అంతకముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై ఉండటంతో.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కి అతడ్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు జిమ్‌లో శ్రమిస్తూ

ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు జిమ్‌లో శ్రమిస్తూ

టెస్టు జట్టులో స్థానం కోల్పోవడంతో ప్రస్తుతం శిఖర్ ధావన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే.. ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు జిమ్‌లో శ్రమిస్తున్నాడు. వెస్టిండీస్‌తో ఈ నెల 21 నుంచి ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత మూడు టీ20 సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ధావన్‌కి వన్డే, టీ20 జట్టులో అవకాశమిస్తారా..? లేక పృథ్వీ షానే ఓపెనర్‌గా కొనసాగిస్తారా..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కోహ్లీ, బుమ్రా, భువీలకు విశ్రాంతి?: విండిస్‌తో ఐదు వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్!

 తొలి టెస్టులో సెంచరీతో తనవైపుకు

తొలి టెస్టులో సెంచరీతో తనవైపుకు

ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న పృథ్వీ షా (134) వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులోనే మెరుపు సెంచరీతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఎన్నో రికార్డులను కొల్లగట్టాడు. దీంతో.. ధావన్‌తో పాటు మరో సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌ స్థానానికీ కూడా పృథ్వీ షా ఎసరు పెట్టేసినట్లు అయింది.

సెలక్షన్ కమిటీపై ఆరోపణలు గుప్పిస్తూనే:

సెలక్షన్ కమిటీపై ఆరోపణలు గుప్పిస్తూనే:

ఇప్పటికే ఈ సిరీస్‌లో తమకు స్థానం దక్కలేదంటూ కరుణ్ నాయర్.. మురళీ విజయ్‌లు సెలక్షన్ కమిటీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వారు చెప్పేదంతా అబద్ధమని తాము ముందుగానే సమచారమిచ్చామంటూ సెలక్షన్ కమిటీ తరపు నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. వీరి వాదన ఇలా ఉంటే నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ ఇప్పటికీ విచారణ చేపట్టకపోవడం గమనార్హం.

శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో రెండో టెస్టు

శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో రెండో టెస్టు

భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటికే తొలి టెస్టు ముగియగా.. భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి జరగనుంది.

Story first published: Tuesday, October 9, 2018, 13:24 [IST]
Other articles published on Oct 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+