కోహ్లీ, బుమ్రా, భువీలకు విశ్రాంతి?: విండిస్‌తో ఐదు వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్!


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు చాలినంత విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు జింబాబ్వేతోనూ సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే ఆక్టోబర్ 4(గురువారం) నుంచి వెస్టిండిస్‌తో సిరీస్ మొదలైంది. ఈ సిరిస్‌లో భాగంగా విండిస్ జట్టుతో కోహ్లీసేన రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విషయం
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విషయం సాధించిన తెలిసిందే. ఈ సిరీస్‌కి ముందు జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఆ టోర్నీలో ఆడిన బుమ్రా, భువనేశ్వర్‌లకి తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

కోహ్లీ, బుమ్రా, భువీలకు వరల్డ్ కప్‌లోపు తగినంత విశ్రాంతి
ఇలా రొటేషన్ పద్ధతిలో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు వరల్డ్ కప్‌లోపు తగినంత విశ్రాంతినివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రస్తుతం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. "వరల్డ్‌కప్‌కు కోరుకుంటే మళ్లీ బోర్డు అతడికి విశ్రాంతిని ఇవ్వొచ్చు. జూన్ 2019లో జరగనున్న వరల్డ్ కప్ వరకు అత్యుత్తమ కాంబినేషన్ ఉండేందుకు గాను రొటేషన్ పాలసీని బోర్డు అవలంభిస్తోంది" అని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

అక్టోబర్ 21 నుంచి ఐదు వన్డేల సిరీస్
ఇందులో భాగంగా వెస్టిండిస్ జట్టుతో అక్టోబర్ 21 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుండగా.. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీని ఆడించాలా? లేక ఆసియా కప్ తరహాలో రోహిత్ శర్మకి పగ్గాలిచ్చి విశ్రాంతినివ్వాలా? అనే ఆలోచనలో సైతం జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

రిజర్వ్ బెంచ్‌ని బలోపేతం చేసుకోవాలని
భారత్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్ కోసం క్రిస్‌గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండా వెస్టిండీస్ జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలసిందే. దీంతో బలహీనమైన విండీస్ జట్టుపై కోహ్లీ, బుమ్రా, భువీ ఆడాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి స్థానంలో యువ ఆటగాళ్లకి అవకాశమిచ్చి వరల్డ్‌కప్‌లోపు రిజర్వ్ బెంచ్‌ని బలోపేతం చేసుకోవాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications